దహెగాం, వెలుగు: మద్యానికి బానిసై మత్తులో గొంతు కోసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకు న్నాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలో జరిగింది. ఎస్సై రమేశ్వివరాల ప్రకారం.. కొంచవెల్లి గ్రామానికి చెందిన లంగారి సత్తయ్యకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు సుమన్(26) మద్యానికి బానిసయ్యాడు.
బుధవారం ఉదయం మద్యం మత్తులో ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసుకున్నాడు. ఎంతసేపటికీ తలుపులు తెరువకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి సత్తయ్య పక్కింటి వాళ్లను పిలిచాడు. కిటికీలో నుంచి చూడగా సుమన్రక్తం మడుగులో పడిఉన్నాడు. తలుపులు పగులగొట్టి చూడగా కత్తితో గొంతు కోసుకొని చనిపోయి ఉన్నాడు. సత్తయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు
చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు.
