ఈ యూట్యూబ్ వీడియోకి వెయ్యి కోట్ల వ్యూస్!

ఈ యూట్యూబ్ వీడియోకి వెయ్యి కోట్ల వ్యూస్!

సియోల్: బేబీ షార్క్ డ్యాన్స్ వీడియో గురించి వినే ఉంటారు. పిల్లల్ని బాగా ఆకట్టుకున్న ఈ వీడియోను పెద్దలు కూడా ఇష్టపడతారు. అందుకే ఈ వీడియో యూట్యూబ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. యూట్యూబ్ హిస్టరీలో 10 బిలియన్ వ్యూస్ దాటిన తొలి వీడియోగా నిలిచింది. బేబీ షార్క్ తర్వాతి స్థానంలో డెస్పాసితో సాంగ్ నిలిచింది. దీనికి ఇప్పటివరకు 7.7 బిలియన్ వ్యూస్ వచ్చాయి. 

ఇకపోతే, హయ్యస్ట్ వ్యూస్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన బేబీ షార్క్ సాంగ్ ను 2016 జూన్ లో యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. పిల్లల కోసం ప్రముఖ కొరియన్ బ్యాండ్ పింక్ ఫాంగ్ దీన్ని తయారు చేసింది. ఈ వీడియోకు విశేష ఆదరణ దక్కింది. క్యాచీ లిరిక్స్ తో సాగడంతో దీనికి చాలా మంది ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ వీడియో అంటే పిల్లలు పడి చస్తారు. తేలికైన పదాలు, చేపల యానిమేషన్, హుషారుగా సాగే ఈ పాట అంటే చెవి కోసుకునే వారు ఉన్నారంటే అతిశయోక్తి లేదు. అందుకే యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ దక్కించుకున్న వీడియోల్లో 15 నెలల పాటు తొలి స్థానంలో కొనసాగింది. దీంతో 2020 నవంబర్ లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించుకుంది. 

మరిన్ని వార్తల కోసం: 

కోహ్లీ ఆవేశం.. కేఎల్ రాహుల్ సంచలన కామెంట్స్

వడ్ల పైసలు రాలేదని దున్నపోతుకు వినతిపత్రం

డోక్లామ్ బార్డర్ దగ్గర్లోనూ రెండు ఊర్లు కట్టిన చైనా