డోక్లామ్ బార్డర్ దగ్గర్లోనూ రెండు ఊర్లు కట్టిన చైనా

డోక్లామ్ బార్డర్ దగ్గర్లోనూ రెండు ఊర్లు కట్టిన చైనా

న్యూఢిల్లీ: ఇండో చైనా బార్డర్ కు సమీపంలోని తమ భూభాగంలో కొత్త ఊర్లను సృష్టిస్తున్న చైనా.. తాజాగా డోక్లామ్ బార్డర్ కు సమీపంలో భూటాన్ భూభాగంలోనూ రెండు ఊర్లను కడుతోంది. హై రెజల్యూషన్​ శాటిలైట్ ఫోటోల ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. ఇంటెల్ ల్యాబ్​కు చెందిన పరిశోధకుడు డామియన్​ సైమన్ 2020 నవంబర్​లో ఈ కొత్త గ్రామాలను గుర్తించారు. పెద్ద సంఖ్యలో ఎర్త్​మూవింగ్, కన్ స్ట్రక్షన్ మెషినరీతో భారీ ఎత్తున ఇండ్లు కడుతున్నట్లు ఆయన వెల్లడించారు. 

చైనా నిర్మిస్తున్న ఈ గ్రామాలు ఇండియా బోర్డర్​కు 30 కి.మీ.లోపు దూరంలోనే ఉన్నాయి. వీటి వల్ల చైనాకు ఈ ప్రాంతంలో మిలిటరీ పరంగా స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఉంటుందని డిఫెన్స్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.14వ రౌండ్ చర్చలు కూడా ఫెయిల్ ఇండియా–చైనా మధ్య బుధవారం జరిగిన 14వ రౌండ్ కోర్ కమాండర్ లెవల్ చర్చలు కూడా ఫెయిలయ్యాయని ఆర్మీ చీఫ్ ​జనరల్ నరవాణె ప్రకటించారు. అయితే ఇరు దేశాలు పరస్పరం అంగీకారమైన పరిష్కారాల కోసం ఇకముందూ కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాయని సమాచారం.