కోహ్లీ ఆవేశం.. కేఎల్ రాహుల్ సంచలన కామెంట్స్

కోహ్లీ ఆవేశం.. కేఎల్ రాహుల్ సంచలన కామెంట్స్

కేప్ టౌన్: డీఆర్ఎస్ రివ్యూపై మరోసారి దుమారం రేగింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో అశ్విన్ బౌలింగ్ లో అశ్విన్ బౌలింగ్ లో ఎల్గర్ రివ్యూలో నాటౌట్ గా తేలడమే దీనికి కారణం. ఆట మూడో రోజు రెండో ఇన్నింగ్స్ 21వ ఓవర్ లో ఎల్గర్ ఔట్ కోసం టీమిండియా అప్పీల్ చేసింది. అంపైర్ ఎరాస్మస్ ఔటిచ్చాడు. కానీ ఎల్గర్ డీఆర్ఎస్ రివ్యూ కోరగా.. అందులో నాటౌట్ గా తేలింది. బంతి కాస్త వికెట్ల పై నుంచి వెళ్తున్నట్లు నిర్ధారణకు వచ్చిన థర్డ్ అంపైర్.. నాటౌట్ గా తేల్చాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లతోపాటు ఫీల్డ్ అంపైర్ కూడా ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన కోహ్లీ.. స్టంప్స్ వద్దకు వెళ్లి మైక్ లో తన ఆవేశాన్ని చెప్పేశాడు. ‘ప్రత్యర్థుల్నే కాదు.. మీ టీమ్ మీదా ఫోకస్ చేయండి’ అని గట్టిగా అరిచాడు. 

కేఎల్ రాహుల్, అశ్విన్ కూడా డీఆర్ఎస్ రివ్యూపై సీరియస్ అయ్యారు. కేవలం 11 మందికి మొత్తం దేశం వ్యతిరేకంగా ఉందని రాహుల్ అన్నాడు. సిరీస్ బ్రాడ్ కాస్టర్ సూపర్ స్పోర్ట్ ను టార్గెట్ చేసిన అశ్విన్.. మీరు గెలవాలంటే మరో మార్గా్న్ని ఎంచుకోవాలని మైక్ వద్ద అన్నాడు. ఇకపోతే, 212 రన్స్ టార్గెట్ తో సెకండ్ ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ప్రస్తుతం రెండు వికెట్లకు 101 పరుగులు చేసింది. విజయానికి మరో 111 రన్స్ చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో గెలవాలంటే భారత్ మిగిలిన 8 వికెట్లు తీయాల్సిందే. 

మరిన్ని వార్తల కోసం: 

వడ్ల పైసలు రాలేదని దున్నపోతుకు వినతిపత్రం

డోక్లామ్ బార్డర్ దగ్గర్లోనూ రెండు ఊర్లు కట్టిన చైనా

జెట్‌‌ స్పీడులో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’