ఒమన్పై విరుచుకుపడిన ఇరాన్.. డ్రోన్ దాడిలో ఇద్దరు ఇండియన్స్ మృతి

ఒమన్పై విరుచుకుపడిన ఇరాన్.. డ్రోన్ దాడిలో ఇద్దరు ఇండియన్స్ మృతి

ఇరాన్ లొంగి పోతుంది.. ఇరాన్ పనైపోయింది అంటూ ఒకవైపు యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్ ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు ఇరాన్ డ్రోన్స్, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తూ దాడికి దిగుతున్న ఇరాన్.. శుక్రవారం (మార్చి 13) ఒమన్ పై డ్రోన్స్ తో దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు ఇండియన్స్ మృతి చెందారు. మరో పది మంది గాయపడినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. 

ఒమన్ లోని సోహార్ సిటీలో జరిగిన దాడిలో మొత్తం 11 మంది గాయపడ్డారు అందులో పది మంది భారతీయులు ఉన్నట్లు అడిషనల్ సెక్రెటరీ అసీమ్ ఆర్ మహజన్ తెలిపారు. గాయపడిన వారిలో ఐదుగురుని డిస్చార్జ్ చేసినట్లు చెప్పారు. 

గాయపడిన వారిలో ఎవరికీ సీరియస్ గాయాలు కాలేదు.. స్థానిక ఏజెన్సీలతో మాట్లాడుతున్నాం.. భారతీయులకు సహాయం చేస్తామని ఆయని తెలిపారు. ఒమన్ అధికారులతో క్షణంక్షణం మాట్లాడుతున్నామని చెప్పారు. 

మరోవైపు ఇద్దరు విదేశీయులు చనిపోయినట్లు అల్ జజీరా ప్రకటించింది. శుక్రవారం ఉదయం అల్–అవాహి పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన దాడిలో ఇద్దరు చనిపోయినట్లు ఒమన్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మవైపు, పొరుగు దేశమైన సౌదీ అరేబియాపై కూడా భారీ సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరగడం గల్ఫ్ లో భయానక వాతావరణం నెలకొంది. ఈ దాడిపై సౌదీ స్పందించింది. తమ దేశ సరిహద్దుల్లోకి ప్రవేశించిన 50 డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూల్చివేసినట్లు ప్రకటించింది. రియాద్ లోని అమెరికా రాయబార కార్యాలయం, చమురు క్షేత్రాలు, అమెరికా సైనిక స్థావరాలపై ఈ డ్రోన్లు దాడికి ప్రయత్నించినట్లు అధికారులు గుర్తిం చారు. యుద్ద ప్రభావం ఒమన్, సౌదీలపై పడడంతో గల్ఫ్ దేశాలన్నీ తమ రక్షణ వ్యవస్థలను సిద్ధం చేశాయి.