హైదరాబాద్ లో నేడు ఆటోలు, క్యాబ్‌ల బంద్

హైదరాబాద్ లో నేడు ఆటోలు, క్యాబ్‌ల బంద్

కార్మిక సంఘాల సమ్మెకు మద్దతుగా ఆటోలు, క్యాబ్ జేఏసీల నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందంటూ దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు బంద్​కు పిలుపునివ్వగా వీరికి ఆటో యూనియన్లు, క్యాబ్ యూనియన్లు కూడా మద్దతు ప్రకటించాయి. దీంతో గ్రేటర్​హైదరాబాద్​లో బుధవారం 80 వేల క్యాబ్ లు, లక్షకు పైగా ఆటోలు రోడ్కెక్కవని ఆటో జేఏసీ, క్యాబ్ జేఏసీ నాయకులు ప్రకటించారు.

సమ్మెలో భాగంగా ట్రాన్స్​పోర్ట్ యూనియన్లు కొన్ని డిమాండ్లను పెట్టాయి. ట్రాన్స్ పోర్ట్ కార్మికుల సంక్షేమం కోసం స్పెషల్​ బోర్డు ఏర్పాటు చేయటంతో పాటు మోటార్ వెహికల్​ యాక్ట్​– 201-9ని రద్దు చేయాలని, ఆటో, క్యాబ్ డ్రైవర్లకు హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ బీమా తప్పనిసరిగా అందించాలనేవి ఇందులో ప్రధానమైనవి. పెరిగిన జనాభాకు అనుగుణంగా సిటీలో కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని ఆటో యూనియన్ జేఏసీ నాయకులు అమనుల్లాఖాన్, వెంకటేశం, సత్తిరెడ్డి కోరారు. క్యాబ్ డ్రైవర్లకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని, ఓలా, ఉబెర్ సంస్థల దోపిడీని నివారించాలని, డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్​ఐ సౌకర్యం కల్పించాలని తెలంగాణ స్టేట్ టాక్సీ అండ్ డ్రైవర్ల జేఏసీ చైర్మన్​ సలావుద్దీన్ కోరారు.