నోరు అదుపులో పెట్టుకోండి.. NDA ఎంపీలకు ప్రధాని మోదీ వార్నింగ్

నోరు అదుపులో పెట్టుకోండి.. NDA ఎంపీలకు ప్రధాని మోదీ వార్నింగ్

ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఢిల్లీలో తన నివాసంలో 37 మంది బీజేపీ ఎంపీలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసిన పీఎం.. ఎన్బీఏ ఎంపీలు రూడ్ బిహేవియర్ తగ్గించుకోవాలని సూచించారు. అదే విధంగా విపక్షాలపై తమ అభిప్రాయాలను రుద్దవద్దని అన్నారు.

బుధవారం (ఆగస్టు 05) ప్రధానితో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో స్వాతీ మాలివాల్, రాఘవ్ చద్ధా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్, విక్రమ్ జిత్ సింగ్ సహనే తదితర ఎంపీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధాని వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడంతో పాటు అనధికార చర్చలు జరిపినట్లు సమాచారం. 

పార్లమెంటు సమావేశాల సందర్భంగా బీజేపీకి చెందిన వివిధ ఎంపీలతో చర్చంచి.. అభిప్రాయాలు సేకరించే క్రమంలో ప్రధాని బ్రేక్ ఫాస్ట్ మీట్ ఏర్పాటు చేశారు. 

ALSO READ : డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు తెలిపే ముచ్చటే లేదు

సభలో ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా హాజరు కావాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం కీలకంగా మారింది.