హైదరాబాద్ లో ఆస్తమా బాధితులకు ఆయుర్వేద ఔషధం పంపిణీ

హైదరాబాద్ లో ఆస్తమా బాధితులకు ఆయుర్వేద ఔషధం పంపిణీ

పద్మారావునగర్, వెలుగు : మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేక ఉచిత ఆయుర్వేద ఔషధ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సికింద్రాబాద్‌‌‌‌లోని పద్మారావునగర్‌‌‌‌లో ఉన్న డాక్టర్ సాయికుమార్ వ్యాధి నివారణ ఆశ్రమం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. 

సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు, మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఔషధ పంపిణీ కొనసాగుతుందని వెల్లడించారు.  

ఊపిరితిత్తుల ఇన్‌‌‌‌ఫెక్షన్లను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుందని, చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు తీసుకోవచ్చని తెలిపారు.  వివరాల కోసం 040-27500127, 7386200127 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.