జాక్ పాట్ కొట్టేసిన బేబీ బ్యూటీ.. లైన్లో రెండు పెద్ద సినిమాలు

జాక్ పాట్ కొట్టేసిన బేబీ బ్యూటీ.. లైన్లో రెండు పెద్ద సినిమాలు

చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది బేబీ(Baby) సినిమా. చాలా రోజులు తరువాత వచ్చిన అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కావడంతో.. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు తెగ ఇంట్రెస్ట్ చూపించారు. ఇక ఈ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన వైష్ణవి చైతన్య(Vaishnavi chaitanya) ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయింది. ఈ సినిమాలో ఆమె నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అంతేకాదు సినిమా సక్సెస్ లో క్రెడిట్ కూడా ఎక్కువ వైష్ణవికే దక్కింది. 

అందుకే బేబీ సినిమా తరువాత టాలీవుడ్ నుండి ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయట. బడా ప్రొడ్యూసర్స్ సైతం వైష్ణవి డేట్స్ కోసం అడుగుతున్నారట. ఇక తాజాగా సమాచారం ప్రకారం మరో రెండు క్రేజీ బ్యానర్లను లైన్లో పెట్టిందట ఈ బ్యూటీ. అందులో ఒకటి ఎస్‌వీసీసీ సంస్థ. అత్తారింటికి దారేది, తొలిప్రేమ, విరూపాక్ష వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన ఈ సంస్థ ఇటీవల సిద్దు జొన్నలగడ్డతో ఒక సినిమా చేస్తున్నారు. ఈ మధ్యే అధికారికంగా మొదలైన ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు ఫుల్ బిజీగా ఉన్న ఈ సినిమాలో సిద్ధుకు జంటగా.. వైష్ణవిని తీసుకున్నారట మేకర్స్. దీనిపై అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుంది.  

ఇక మరో ప్రముఖ నిర్మాణ సంస్థ దిల్ రాజు ఎస్వీసి బ్యానర్. ఈ బ్యానర్ లో రౌడీ బాయ్స్‌ హీరో ఆశిష్ రెడ్డి హీరోగా ఓ సినిమా రానుంది. ఈ సినిమాలో కూడా హీరోయిన్‌గా వైష్ణవినే ఫిక్స్‌ చేశారట. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్క సినిమా హిట్ అయినా వైష్ణవి చైతన్య స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోవడం ఖాయం అంటున్నారు నెటిజన్స్. మరి ఈ రెండు బడా నిర్మాణ సంస్థలు వైష్ణవికి ఎలాంటి రిజల్ట్ ఇవ్వనున్నాయో చూడాలి మరి.