V6 న్యూస్ ఛానల్ మరోసారి ప్రజల పక్షాన నిలిచి.. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చింది. చంద్రన్నకుంట కబ్జా కథనానికి అధికారులు స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాచుపల్లి సర్వే నెంబర్ 483 లోని చంద్రన్న కుంట చెరువు కబ్జాపై వి6లో ప్రసారం చేసిన కథనానికి అధికార యంత్రాంగం బాధ్యులపై చర్యలు తీసుకుంది. గత కొంతకాలంగా 1.14 ఎకరాల చెరువు స్థలాన్ని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించారు.
ప్రభుత్వ చెరువులను కాపాడాలని .. ఆక్రమణలు తొలగించాలని స్థానికులలు ఆకుల సతీష్ తో కలిసి కొంతమంది నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని V6 న్యూస్ ఛానల్ ప్రసారం చేసింది. దీనికి స్పందించిన హైడ్రా అధికారులు.. ఏప్రిల్ నెలలో అందిన ఫిర్యాదు మేరకు తక్షణమే రంగంలోకి దిగారు.
చంద్రన్న కుంట చుట్టూఫెన్సింగ్ వేసి, చెరువును ఆక్రమణలను పూర్తిగా తొలగించారు.
ప్రజా సమస్యలను.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, చెరువును కాపాడేలా చేసిన వి6 న్యూస్ ఛానల్‌కు .. ఆఛానల్ కథనానికి స్పందించి చర్యలు తీసుకున్న హైడ్రా కమిషనర్, సిబ్బందికి.. నిజాంపేట్ సర్కిల్ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై వి6 న్యూస్ పోరాటం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని వారు ఆకాంక్షించారు.
