ఫిఫా వరల్డ్ కప్ 2026 లో జర్మనీ ప్లేయర్ మాన్యుయెల్ న్యూయెర్ రికార్డు సృష్టించాడు. ప్రపంచ కప్ లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన ఫ్రాన్స్ ప్లేయర్ హ్యూగో లోరిస్‌ను అధిగమించాడు. ఐవరీ కోస్ట్‌తో జరిగిన గ్రూప్ E పోరులో 21వ మ్యాచ్ ఆడి, ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక మ్యాచ్ లలో ఆడిన గోల్ కీపర్ గా ఈ ఘనత సాధించాడు.
20 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో ఆడిన హ్యూగో లోరిస్‌ను న్యూయెర్ అధిగమించాడు. దీంతో గ్లోబల్ స్టేజ్ లో గోల్ కీపర్‌లకు సిరికొత్త బెంచ్ మార్క్ ను . ఇదే మ్యాచ్ లో ఐవరీ కోస్ట్ ఆటగాడు ఫ్రాంక్ కెస్సీ.. 30 నిమిషంలో గోల్ చేసీ లెగసీని కొనసాగించాడు.
ఆప్టా ప్రకారం, 29 సంవత్సరాల 183 రోజుల వయస్సులో ఐవరీ కోస్ట్ తరఫున గోల్ చేసిన కెస్సీ.. ఈ ఏజ్ లో ఘనత సాధించిన ప్రపంచ కప్ చరిత్రలో రెండవ అతి పెద్ద ఆటగాడిగా నిలిచాడు. కెస్సీకి ముందు డిడియర్ డ్రోగ్బా ఉన్నాడు. 2010లో 32 సంవత్సరాల 101 రోజుల వయస్సులో గోల్ చేసి.. అతి పెద్ద వయసులో గోల్ చేసిన ఆటగాడిగా డిడియర్ డ్రోగ్బా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు.
2026 ఫీఫా ప్రపంచ కప్ ముగిసిన తర్వాత రిటైర్ అవుతానని ఐవరీ కోస్ట్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు ప్రకటించాడు
