2027 వరల్డ్ కప్ కోసం కొత్త స్కెచ్.. కేఎల్ రాహుల్‌ను పక్కన పెట్టిన భారత్!

2027 వరల్డ్ కప్ కోసం కొత్త స్కెచ్.. కేఎల్ రాహుల్‌ను పక్కన పెట్టిన భారత్!

KL Rahul: చెన్నైలోని చేపాక్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ మొదట బ్యాటింగ్ తీసుకోగా, టీమిండియా చెపాక్ పిచ్‌పై టార్గెట్‌ను ఛేజ్ చేయడానికి రెడీ అయింది. అయితే, మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే భారత ఫ్యాన్స్ అందరినీ ఒకే ప్రశ్న వేధించింది.. ప్లేయింగ్ ఎలెవెన్‌లో కేఎల్ రాహుల్ (KL Rahul) ఎందుకు లేదని. 

కేఎల్ రాహుల్ ఎందుకు ఆడట్లేదంటే?: 
ఫామ్‌లో ఉన్నప్పటికీ కేఎల్ రాహుల్‌ను ఈ మ్యాచ్ తుది జట్టు నుంచి తప్పించారు. దీనికి కారణం జట్టు కాంబినేషన్, ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) టీమ్‌లోకి తిరిగి రావడం కోసమే.. సిరీస్ ఆల్రెడీ 2–0తో ఇండియా గెలవడంతో.. బెంచ్ స్ట్రెంత్‌ను పరీక్షించేందుకు టీమ్ మేనేజ్‌మెంట్ రాహుల్‌కు రెస్ట్ ఇచ్చి, ఆల్ రౌండ్ ఆప్షన్ కోసం మన తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డిని తుది జట్టులోకి తీసుకుంది. కేఎల్ రాహుల్‌తో పాటు జట్టులో మొత్తం మూడు మార్పులు చేసింది. ప్రసిద్ధ్ కృష్ణ, హర్ష్ దూబే, నితీష్ రెడ్డిలు టీమ్‌లోకి వచ్చారు.

ALSO READ : వర్డల్కప్ ముందు భారత్కి బిగ్ షాక్.. 

గిల్ మైండ్ గేమ్: 
భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. పిచ్ చాలా బాగుంది, ఒకవేళ మేము టాస్ గెలిచినా మొదట బ్యాటింగే తీసుకునే వాళ్లం.. గత మ్యాచ్ లాగే ఇక్కడ కూడా ఎండ చాలా ఎక్కువగా ఉంది. కానీ, ఈ మ్యాచ్‌లో మేము మొదట ఫీల్డింగ్ చేయాల్సి రావడం ఒక రకంగా మంచిదే. ఎందుకంటే, పెద్ద స్కోర్లను ఈజీగా, కన్‌సిస్టెంట్‌గా ఛేజ్ చేయడం అనే ఒక ఏరియాలో మేము ఇంకా పర్‌ఫెక్ట్ అవ్వలేదన్నాడు. ఈరోజు మా ఛేజింగ్ గేమ్ ఎలా ఉందో చూసేందుకు ఇదొక సూపర్ ఛాన్స్ అని గిల్ పేర్కొన్నాడు.