బంగారానికి ఏమైంది? ఆల్-టైమ్ హై నుండి అగాధంలోకి రేట్లు.. ఇంకా తగ్గుతాయా?

బంగారానికి ఏమైంది? ఆల్-టైమ్ హై నుండి అగాధంలోకి రేట్లు.. ఇంకా తగ్గుతాయా?

బంగారం కేవలం ఒక పెట్టుబడే కాదు ఎమోషన్ కూడా ఇండియన్ ఫ్యామిలీస్ కి. 2025లో ఏకంగా 65% బంపర్ రిటర్న్స్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన గోల్డ్.. 2026కు వచ్చేసరికి మాత్రం ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్‌లోనే గోల్డ్ రిటర్న్స్ మైనస్ 4 శాతానికి పడిపోయి షాక్ ఇచ్చింది. జనవరిలో సరికొత్త రికార్డులను సృష్టించిన బంగారం.. ఇప్పుడు ఎందుకు చతికిలపడింది? అసలు మార్కెట్లో ఏం జరుగుతోంది? బంగారం మళ్లీ పుంజుకుంటుందా లేదా అనే ప్రశ్నలకు జవాబు చూద్దాం రండి...

ఆల్-టైమ్ హై నుండి అగాధంలోకి..
2026 ప్రారంభం బంగారం మార్కెట్‌కు చాలా అద్భుతంగా దొరికింది. అక్టోబర్ 2022 నుంచి మొదలైన బుల్ రన్ జోష్‌లో.. ఈ ఏడాది జనవరి చివరి నాటికి గోల్డ్ ప్రైస్ 5వేల 602 డాలర్ల ఆల్-టైమ్ హై రికార్డును తాకింది. ఆ తర్వాత మిడిల్ ఈస్ట్ సంక్షోభం తెరపైకి రావడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. యుద్ధ వాతావరణం వల్ల మార్కెట్లలో లిక్విడిటీ కొరత ఏర్పడింది. దీంతో లాభాలను మూటగట్టుకోవడానికి ఇన్వెస్టర్లు బంగారం, వెండిని పెద్ద ఎత్తున అమ్మడం ప్రారంభించారు. ఫలితంగా జూన్ 10 నాటికి గోల్డ్ రేట్ ఏకంగా 28% పడిపోయి 4వేల డాలర్ల వార్షిక కనిష్టానికి పడిపోయింది. ప్రస్తుతం గోల్డ్ 4వేల144 డాలర్ల దగ్గర ఊగిసలాడుతోంది.

గోల్డ్ ఎందుకు పెరగట్లేదు?
అమెరికా-ఇరాన్ మధ్య హార్ముజ్ జలసంధి ఓపెనింగ్ ఒప్పందం తర్వాత క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపు 15% వరకు తగ్గాయి. మరి ఆయిల్ రేట్లు తగ్గినప్పుడు బంగారం ధరలు పెరగాలి కదా? కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం మార్కెట్‌ను శాసిస్తోంది జియోపొలిటికల్ టెన్షన్స్, ఆయిల్ ధరలు కాదు.. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లు. జూన్ 17న జరిగిన యూఎస్ ఫెడ్ మీటింగ్‌లో కొత్త చైర్మన్ కెవిన్ వార్ష్ కీలక ప్రకటన చేశారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి 2026లో కనీసం ఇంకొకసారైనా వడ్డీ రేట్లను పెంచుతామని హింట్ ఇచ్చారు. పైగా ఎలాంటి ముందస్తు గైడెన్స్ ఇవ్వకపోవడంతో మార్కెట్లో అనిశ్చితి పెరిగి, బంగారంపై తీవ్ర ఒత్తిడి పడింది.

కింగ్‌లా దూసుకుపోతున్న డాలర్ ఇండెక్స్..
బంగారానికి, అమెరికా డాలర్‌కు ఎప్పుడూ రివర్స్ రిలేషన్ ఉంటుంది. డాలర్ పుంజుకుంటే బంగారం పడిపోతుంది. 2025లో 12% బలహీనపడిన డాలర్ ఇండెక్స్, 2026లో మాత్రం 2.6% పైగా పుంజుకుని 100 మార్కును దాటేసింది. వడ్డీ రేట్లు ఎక్కువ కాలం పాటు అలాగే ఉంటాయనే భయంతో ఇన్వెస్టర్లు బంగారం వైపు కాకుండా డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే వడ్డీ ఆదాయం ఇవ్వని గోల్డ్ పై ఆకర్షణ తగ్గింది.

ALSO READ : పీఎఫ్ విత్‌డ్రా సూపర్ ఈజీ

మరి గోల్డ్ బుల్ రన్ ముగిసిపోయినట్లేనా? అంటే ప్రశ్నకు నిపుణులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఒకవేళ ద్రవ్యోల్బణం తగ్గి, ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే బంగారం మళ్లీ రాకెట్‌లా దూసుకుపోవచ్చు. ఒకవేళ ద్రవ్యోల్బణం ఇలాగే కొనసాగినా.. సురక్షితమైన పెట్టుబడిగా గోల్డ్‌కు డిమాండ్ పెరుగుతుంది. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇప్పటికీ బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. కాబట్టి సామాన్య ఇన్వెస్టర్లు మార్కెట్ టైమింగ్స్ గురించి టెన్షన్ పడకుండా, తమ పోర్ట్‌ఫోలియోలో 5 నుండి 10 శాతం వరకు బంగారం వెండికి చోటు కల్పించటం లాంగ్ టర్మ్ గోల్స్‌కు ఎల్లప్పుడూ సేఫ్ బెట్ అంటున్నారు నిపుణులు.