న్యూఢిల్లీ: వీడియోకాన్ ఇండస్ట్రీస్ మాజీ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్ దివాలా తీశారని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబై బెంచ్ ప్రకటించింది. స్టేట్ బ్యాంక్ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ ఈ ఆదేశాలు జారీ చేసింది. వీడియోకాన్ లోన్లకు ధూత్ వ్యక్తిగత హామీదారు. బకాయిల విలువ 2026 సెప్టెంబర్ నాటికి రూ.12,668.06 కోట్లకు చేరింది. ధూత్ తన ఆర్థిక స్థితిగతుల వివరాలను 7 రోజుల్లో దివాలా ట్రస్టీకి సమర్పించాలి. గతంలో ఆయన రూ.600 కోట్ల చెల్లింపుతో 36 నెలల్లో బకాయిలు తీర్చేందుకు ఇచ్చిన ప్రతిపాదనకు ఆమోదం రాలేదు.
