ఫ్యూచర్‌‌‌‌ రిటైల్‌‌‌‌ ప్రమోటర్‌‌‌‌ కిషోర్‌‌‌‌ బియానీపై సీబీఐ కేసు

ఫ్యూచర్‌‌‌‌ రిటైల్‌‌‌‌ ప్రమోటర్‌‌‌‌ కిషోర్‌‌‌‌ బియానీపై సీబీఐ కేసు

న్యూఢిల్లీ: ఫ్యూచర్‌‌‌‌ రిటైల్‌‌‌‌ ప్రమోటర్‌‌‌‌ కిషోర్‌‌‌‌ బియానీపై రూ.904.32 కోట్ల బ్యాంకు మోసం ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆయన సోదరుడు రాకేశ్‌‌‌‌ బియానీ పేరును కూడా చేర్చింది. ఎస్​బీఐ ఫిర్యాదు ఆధారంగా నవంబర్‌‌‌‌ 4న ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. ఎస్‌‌‌‌బీఐతో పాటు 9 బ్యాంకుల కన్సార్టియం నుంచి లోన్లు పొందేందుకు నిందితులు కుట్ర చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  లోన్ల డబ్బును అనుబంధ సంస్థలు, రిలేటెడ్​ కంపెనీల ద్వారా మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల బ్యాంకుకు రూ.904.32 కోట్ల నష్టం వాటిల్లినట్లు సీబీఐ పేర్కొంది.