తమిళ్ పాలిటిక్స్‎లో కీలక పరిణామం.. డీఎంకేతో 64 ఏళ్ల బంధానికి IUML గుడ్ బై

తమిళ్ పాలిటిక్స్‎లో కీలక పరిణామం.. డీఎంకేతో 64 ఏళ్ల బంధానికి IUML గుడ్ బై

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రతిపక్ష డీఎంకే కూటమి నుంచి ఐయూఎంల్ పార్టీ వైదొలిగింది. శనివారం (జూన్ 20) జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు ఐయూఎంల్ నిర్ణయం తీసుకుంది. దీంతో డీఎంకే, ఐయూఎంల్ 64 ఏళ్ల బంధానికి ఎండ్ కార్డ్ పడింది. 

1962 నుంచి ఐయూఎంల్ డీఎంకేతో కలిసి పని చేస్తోంది. ప్రతి ఎన్నికల్లోనూ డీఎంకేతో ఐయూఎంల్ పొత్తు పెట్టుకుంది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. కానీ ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఓటమి పాలైంది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో డీఎంకే కూటమితో ఐయూఎంల్ సుధీర్ఘ బంధాన్ని తెంచుకుంది.

 అసెంబ్లీ ఎన్నికల అనంతరం డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ సైతం వైదొలిగిన విషయం తెలిసిందే. తాజాగా ఐయూఎంల్ కూడా కూటమికి కటీఫ్ చెప్పడం ప్రతిపక్ష డీఎంకే పార్టీకి భారీ ఎదురు దెబ్బే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.