చిట్టీల వ్యాపారం చేస్తుండని....ప్రభుత్వ టీచర్ ను సస్పెండ్ చేసిన డీఈవో

చిట్టీల వ్యాపారం చేస్తుండని....ప్రభుత్వ టీచర్  ను సస్పెండ్ చేసిన డీఈవో

హనుమకొండ సిటీ, వెలుగు: భీమదేవరపల్లి జడ్పీ హైస్కూల్​లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కలువల ఎల్లయ్యను సస్పెండ్ చేస్తూ హనుమకొండ డీఈవో ఎల్వీ గిరిరాజ్ గౌడ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లయ్య కొన్నేళ్లుగా ప్రైవేట్ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ సభ్యులను మోసగించినట్లు ఏప్రిల్‌‌‌‌లో జిల్లా కలెక్టర్‌‌‌‌కు ఫిర్యాదు అందింది. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో  దర్యాప్తు చేపట్టగా ఆరోపణలు నిజమని తేలింది. దీంతో ఎల్లయ్యపై సస్పెన్షన్  వేటు వేశారు.