Hardik Pandya Ruled Out: భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఫ్యాన్స్‌కు మళ్లీ బ్యాడ్ న్యూస్. గాయం నుంచి కోలుకుని వన్డే ఫార్మాట్లోకి గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇద్దామనుకున్న అతడి ఆశలు ఆవిరియ్యాయి. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు పాండ్యా పూర్తిగా దూరమయ్యాడు. 50 ఓవర్ల క్రికెట్‌కు అవసరమైన పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించడంలో హార్దిక్ విఫలమవడమే దీనికి కారణం.
హార్దిక్ కు మళ్లీ కొత్త గాయం:
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న సమయంలో హార్దిక్ పాండ్యాకు నడుము నొప్పి (Back Spasm) వచ్చింది. దీంతో అతను ఐపీఎల్‌లో చాలా మ్యాచ్‌లు మిస్ అయ్యాడు. ఆ తర్వాత బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో చేరి రిహాబిలిటేషన్ పూర్తి చేశాడు. అక్కడ ప్రాక్టీస్ సెషన్స్‌లో ఏకంగా 10 ఓవర్ల పూర్తి కోటాను బౌలింగ్ చేసి.. కమ్‌బ్యాక్ ఇస్తాడని అందరూ అనుకున్నారు. కానీ, అక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది. బౌలింగ్ వర్క్‌లోడ్ సడన్‌గా పెంచడంతో ఈ నెల మొదట్లో అతనికి కొత్తగా క్వాడ్రిసెప్స్ స్ట్రెయిన్ (తొడ కండరాల గాయం) అయింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఆఫ్ఘనిస్థాన్ వన్డే సిరీస్‌తో పాటు వచ్చే నెల జరగబోయే కీలకమైన ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌కు కూడా అతను అందుబాటులో ఉండటం లేదు.
2027 వరల్డ్ కప్ ప్లాన్స్:
హార్దిక్ పాండ్యా టీమిండియా వైట్-బాల్ క్రికెట్‌లో అత్యంత కీలకమైన ప్లేయర్.. అతను జట్టులో ఉంటే వచ్చే బ్యాలెన్సే వేరు.. కానీ, 2023 వన్డే వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌పై గాయపడినప్పటి నుంచి అతడు వన్డే ఫార్మాట్‌కు చాలా దూరంగానే ఉంటున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ (సౌతాఫ్రికా)ను దృష్టిలో పెట్టుకుని, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్.. జస్‌ప్రీత్ బుమ్రా లాగే హార్దిక్ పాండ్యాను కూడా వన్డేల్లో ఫిట్‌గా ఉంచడమే మా మెయిన్ టార్గెట్ అని రీసెంట్‌గా చెప్పారు. అందుకోసం టీ20ల్లో అతనికి రెస్ట్ ఇచ్చి వన్డేలు ఆడించాలనుకున్నారు, కానీ పాండ్యా బాడీ మాత్రం ఇందుకు సహకరించడం లేదని తెలుస్తుంది.
పాండ్యా ప్లేస్‌లోకి నితీష్ కుమార్ రెడ్డి:
హార్దిక్ పాండ్యా పదే పదే గాయాల బారిన పడుతుండటంతో భారత మేనేజ్‌మెంట్ ప్రత్యామ్నాయాలపై (Backup Options) ఫోకస్ పెట్టింది. ఈ సందర్భంగా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్ మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా వైజాగ్ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)ని మేము చూస్తున్నాం.. అతని డెవలప్‌మెంట్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ నిశితంగా గమనిస్తోందని చెప్పుకొచ్చాడు.
