పర్భానీ: మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాలో విషాద ఘటన జరిగింది. యశ్వాది దేవస్థాన్‌లోని హనుమాన్ ఆలయ మండపం పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఆరు మృతదేహాలను ఇప్పటికి వెలికితీశారు. సుమారు 30-40 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.
In Maharashtra Parbhanithe tragic roof collapse incident at the Hanuman Temple in Yashwadi village 😳 6 people died and 30-40 people are injured !💔#maharashtra pic.twitter.com/mz8yHgG01L
— Manan Trivedi (@itsurbunny7) June 20, 2026
గాయపడిన 10 మందిని ఆసుపత్రికి తరలించారు. ఆలయానికి సరిగ్గా ఎదురుగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మధ్యాహ్నం పూజల సమయంలో ప్రజలు ప్రసాదం స్వీకరిస్తుండగా.. ఆ నిర్మాణం అకస్మాత్తుగా కూలిపోయింది.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటపడింది. ఈ ఘటన మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో జరిగింది. శనివారం కావడంతో ఆలయం జనంతో కిక్కిరిసిపోయింది. కీర్తన, మహాప్రసాదం స్వీకరించడానికి జనాలు బారులు తీరారు. ప్రమాదం జరిగిన అనంతరం, పోలీసులు, స్థానిక అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు.
