పెళ్లి కోసం వయస్సు తగ్గించి చెప్పిన భర్త.. హైకోర్టుకు వెళ్లి విడాకులు తెచ్చుకున్న భార్య

పెళ్లి కోసం వయస్సు తగ్గించి చెప్పిన భర్త.. హైకోర్టుకు వెళ్లి విడాకులు తెచ్చుకున్న భార్య

సాధారణంగా పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అబ్బాయిల తరపు వాళ్లు వయసు కొద్దిగా తక్కువ చెప్పడం మనం వింటూనే ఉంటాం. ఏదో ఒకటి రెండు ఏళ్లు అటు ఇటుగా చెబితే సర్దుకుపోవచ్చు కానీ.. ఏకంగా 7 ఏళ్లు ఏజ్ తగ్గించి దానికి తప్పుడు పుట్టిన తేదీతో జాతకాలు కలిపి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి ఒక షాకింగ్ మోసమే హైదరాబాద్‌లో వెలుగుచూసింది. మ్యాట్రిమోనీ సైట్‌లో వయసు దాచి మోసం చేసిన భర్తకు తెలంగాణ హైకోర్టు గట్టి షాక్ ఇస్తూ భార్య కోరిక మేరకు విడాకులు మంజూరు చేసిన వార్త ఇప్పుడు పెద్ద సంచనంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. 2018లో 'తెలుగు మ్యాట్రిమోనీ' పోర్టల్ ద్వారా వీరికి అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది. అప్పట్లో సదరు అబ్బాయి తన పుట్టిన తేదీని ఫిబ్రవరి 9, 1981గా పేర్కొన్నాడు. అమ్మాయి కుటుంబం సాంప్రదాయబద్ధమైనది కావడం, జాతకాలు నమ్మడం వల్ల ఆ తప్పుడు డేట్ ఆఫ్ బర్త్‌ను నిజమని నమ్మి జాతకాలు కుదరటంతో పెళ్లి చేసేశారు. కానీ నిజానికి అతని అసలు పుట్టిన తేదీ ఫిబ్రవరి 9, 1974. అంటే పెళ్లి నాటికి అతను భార్య కంటే దాదాపు 9 ఏళ్లు పెద్దవాడు. పెళ్లయిన కొత్తలోనే భర్త, అత్త, ఆడపడుచుల నుంచి ఆమెకు తీవ్ర వేధింపులు మొదలయ్యాయి.

పెళ్లయిన కొన్ని నెలలకే ఈ జంట తమ వివాహాన్ని రిజిస్టర్ చేయడానికి హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ సబ్-రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో భర్త తన అసలు వయసును బయటపెట్టాల్సి వచ్చింది. అది చూసి భార్య మైండ్ బ్లాక్ అయింది. తప్పుడు వివరాలతో జాతకాలు కలిపి తన జీవితాన్ని నాశనం చేశారని గ్రహించిన ఆమె.. వెంటనే భర్తపై చీటింగ్, ఫ్రాడ్ కేసులు పెట్టడంతో పాటు డొమెస్టిక్ వయలెన్స్ కేసు కూడా ఫైల్ చేసింది.

ALSO READ : బైక్ పార్కింగ్ చేయొద్దన్నందుకు ఇంత దారుణమా?

ఫ్యామిలీ కోర్టులో న్యాయం జరగకపోవడంతో ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. విచారణలో ఇద్దరికీ కలిసి ఉండే ఉద్దేశం లేదని స్పష్టమైంది. తన బంగారం తిరిగి ఇచ్చి, సరైన సెటిల్‌మెంట్ చేస్తే క్రిమినల్ కేసులు వెనక్కి తీసుకుంటానని భార్య చెప్పగా.. ఆమె వద్దే తన బంగారం ఉందని భర్త వాదించాడు. ఫైనల్ గా హైకోర్టు వీరి వివాహాన్ని రద్దు చేస్తూ విడాకులు మంజూరు చేసింది. అలాగే పర్మనెంట్ భరణం కోసం హిందూ వివాహ చట్టం సెక్షన్ 25 కింద విడిగా దరఖాస్తు చేసుకోవాలని, బంగారం రికవరీ కోసం ఇతర కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న గృహ హింస కేసుల ద్వారా తేల్చుకోవచ్చని భార్యకు స్పష్టం చేసింది. సో పెళ్లి కోసం ఏజ్ తక్కువ చేసి చెప్పుకునే అలవాటును మన కుర్రోళ్లు మానుకోవాలి ఈ కేసు స్పష్టంగా హెచ్చరిస్తోంది.