బైక్ పార్కింగ్ చేయొద్దన్నందుకు ఇంత దారుణమా? ముసలాయనను దారుణంగా కొట్టిన ఐటీ ఉద్యోగి..

బైక్ పార్కింగ్ చేయొద్దన్నందుకు ఇంత దారుణమా? ముసలాయనను దారుణంగా కొట్టిన ఐటీ ఉద్యోగి..

పక్క పక్క ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ఏండ్లకుపైగా కలిసి ఉంటున్నారు. చిన్న విషయంలో గొడవ.. మాటా మాటాపెరిగింది.. నువ్వెంత అంటే  నువ్వెంత అంటూ ఇగోలకు పోయారు.ఇంకేముంది.. మాటల ముదిరి ఘర్షణకు దారి తీసింది. ఓ బైక్ పార్కింగ్ విషయంలో గొడవపడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి  ఓ వృద్దుడిని తోసేయడంతో కింద పడ్డవాడు  మళ్లీ లేవలేదు..చిన్న గొడవలు భారీ మూల్యం చెల్లించుకోవడం అంటే ఇదేనోమే. 

అది నోయిడాలోని సెక్టార్ 15 ఫేజ్ లో  పక్కపక్క ఇండ్లలో నివసిస్తున్నారు 77 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి,  30 ఏళ్ల సాఫ్ట వేర్ ఇంజనీరు.  అపార్టుమెంటులో చాలా రోజులుగా కలిసి ఉంటున్నారు. ఎలాంటి గొడవలు లేదు. అయితే ఉన్నట్టుండి శనివారం (జూన్ 20) ఇద్దరి మధ్య బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.గొడవ ముదిరి చివరికి పెద్దాయన ప్రాణాల మీ దకు తెచ్చింది. 

తన బైకు పక్కన పార్కింగ్ చేయొద్దని ఐటీ ఉద్యోగిని మందలించాడు రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి.. అయి తే నాకే చెబుతావా..కోపంతో ముసలాయనను ఒక్క తోపు తోయడంతో కిండపడి పోయాడు. పడ్డవాడు మళ్లీ లేవలేదు. విషయం తెలుసుకున్న అపార్టుమెంట్ వాసులు గాయాలతో ఉన్న పెద్దాయనను ఆస్పత్రికి తరలించడగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.