ప్రముఖ లగ్జరీ కార్ల బ్రాండ్ 'పోర్షే ఇండియా'.. ఈవీఎం ప్రీమియం కార్స్ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో సరికొత్త షోరూమ్‌ను అధికారికంగా ప్రారంభించింది. నగరంలో పోర్షే బ్రాండ్‌కు ఇది రెండవ సేల్స్ పాయింట్. సుమారు 2,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన పోర్షే సెంటర్ హైదరాబాద్.. దేశంలోనే అత్యంత భారీ ఫెసిలిటీగా రికార్డు సృష్టించింది. ఇక్కడ సేల్స్, సర్వీస్, స్పేర్ పార్ట్స్ సేవలు అన్నీ ఒకే చోట లభిస్తాయి.
హైదరాబాద్‌లోని ప్రముఖ బిజినెస్ డిస్ట్రిక్ట్స్‌కు అత్యంత సమీపంలో ఈ కేంద్రాన్ని వ్యూహాత్మకంగా ఏర్పాటు చేశారు. బెంగళూరు, చెన్నై తర్వాత సేల్స్, సర్వీస్, స్పేర్ పార్ట్స్ కలిపి ఉన్న మూడవ కంబైన్డ్ ఫెసిలిటీ ఇదే. అధునాతన డెస్టినేషన్ పోర్షే షోరూమ్ డిజైన్ కాన్సెప్ట్‌తో దీనిని రూపొందించారు. ఇది కార్ల ప్రియులకు కేవలం అనుభవాన్ని మాత్రమే కాకుండా.. ఒక లగ్జరీ లైఫ్‌స్టైల్ వాతావరణాన్ని అందిస్తుంది.
►ALSO READ | పాత ఫోన్ అమ్ముతున్నారా? మీ పర్సనల్ డేటా లీకయ్యే ఛాన్స్.. సర్వేలో షాకింగ్ నిజాలు !
ఈ సందర్భంగా పోర్షే ఇండియా హెడ్ అశుతోష్ దీక్షిత్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో వ్యాపార రంగం, లగ్జరీ మైండ్‌సెట్ వేగంగా ఎదుగుతున్నాయని, అందుకే తమ పూర్తి సేవలను ఇక్కడ విస్తరిస్తున్నట్లు చెప్పారు. గత పదేళ్లకు పైగా పోర్షే భాగస్వామిగా ఉన్న ఈవీఎం ప్రీమియం కార్స్ డీలర్ ప్రిన్సిపల్ సాబు జానీ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి టెక్నికల్ నైపుణ్యంతో హైదరాబాద్ కస్టమర్లకు బెస్ట్ సర్వీస్ అందిస్తామన్నారు.
