భారతదేశంలో సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు జోరందుకుంటున్న.. ప్రజల్లో డేటా సేఫ్టీ గురించి భయాలు ఇంకా పోలేదు. తాజాగా జరిపిన ఒక సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సుమారు 8వేల మందిపై జరిపిన ఈ సర్వే ప్రకారం.. చాలామంది పాత ఫోన్లను అమ్మడానికి వెనుకాడుతున్నారు. అందులో 69% మంది పాత ఫోన్లను అసలు అమ్మడం లేదు. కారణం.. వారి వ్యక్తిగత సమాచారం బయటకు ఎక్కడ లీక్ అవుతుందోననే భయం. 74% మంది ఫోన్ అమ్మిన తర్వాత వాళ్ళ పర్సనల్ డేటా దుర్వినియోగం అవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. అయిన.. 56.6% మంది ఇప్పటికే పాత ఫోన్లను అమ్మడం లేదా ఎక్స్ఛేంజ్ చేయడం చేశారు.
డేటా సేఫ్టీకే ఫస్ట్ ప్రయారిటీ
ఇంతకుముందు ఫోన్ అమ్మేటప్పుడు ఎక్కువ ధర ఎక్కడ వస్తే అక్కడ అమ్మేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. 45.3% మంది డేటా సేఫ్టీకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. కేవలం 29.5% మంది మాత్రమే మంచి ధర వస్తే అమ్మెందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.
ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే డేటా పోతుందా
చాలామంది ఫోన్ అమ్మేముందు ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. 83.3% మంది ఫోన్ అమ్మే ముందు ఫ్యాక్టరీ రీసెట్ చేస్తున్నారు. కానీ, అందులో 41.1% మందికి ఫ్యాక్టరీ రీసెట్ చేసినా డేటా శాశ్వతంగా డిలీట్ అవ్వదనే విషయం తెలుసు. సర్వేలో పాల్గొన్నవారిలో 31% మంది డిలీట్ అయిపోయిన డేటాను రికవరీ టూల్స్ ద్వారా మళ్లీ వెనక్కి తెప్పించగలిగారు కూడా.
ALSO READ : క్రెడిట్ కార్డ్ పోయిందా?
ఫ్యాక్టరీ రీసెట్ వేరు, సెక్యూర్ డిలీషన్ వేరు.
ఫ్యాక్టరీ రీసెట్ చేసినప్పుడు కేవలం యాప్స్, ఫైల్స్ పైకి కనిపించకుండా పోతాయి అంతే. కానీ ఆ డేటా అంతా ఫోన్ హార్డ్‌వేర్‌లోనే ఉంటుంది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ల సాయంతో దానిని మళ్లీ బ్యాకప్ చేసి దొంగిలించవచ్చు. అదే 'సెక్యూర్ డేటా డిలీషన్'లో అయితే, డేటాపై పదే పదే వేరే సమాచారాన్ని ఓవర్‌రైట్ చేస్తారు. దీనివల్ల పాత డేటాను తిరిగి బ్యాక్ అప్ చేయడం అసాధ్యం.
