క్రెడిట్ కార్డ్ పోయిందా? వెంటనే ఈ పని చేయకపోతే చిక్కుల్లో పడతారు జాగ్రత్త..

క్రెడిట్ కార్డ్ పోయిందా? వెంటనే ఈ పని చేయకపోతే చిక్కుల్లో పడతారు జాగ్రత్త..

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జేబులోనూ క్రెడిట్ కార్డ్ కామన్‌గా మారిపోయింది. షాపింగ్ నుంచి రోజువారీ ఖర్చుల వరకు అన్నింటికీ ఇదే దిక్కు చాలా మందికి. అంతగా ఉపయోగపడే క్రెడిట్ కార్డ్ ఎక్కడైనా పోతే మాత్రం గుండె ఆగినంత పనవుతుంది. కార్డ్ పోయిందని తెలియగానే చాలామంది కంగారుపడి ఏం చేయాలో తెలియక సమయాన్ని వృథా చేస్తుంటారు. అయితే ఆ సమయంలో ఎంత అలర్ట్‌గా ఉంటే అంత సేఫ్ లేదంటే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. 

కార్డ్ పోయిందని తెలిసిన మరుక్షణమే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటిగా చేయాల్సిన పని దాన్ని బ్లాక్ చేయడటమే. బ్యాంక్ మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ సర్వీస్ లేదా కస్టమర్ కేర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి వెంటనే కార్డ్‌ను లాక్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీ కార్డ్ వేరే ఎవరి చేతికి చిక్కినా.. దాని నుండి ఎలాంటి లావాదేవీలు జరగకుండా అడ్డుకోవచ్చు. తప్పుడు పనులకు వాడకటాన్ని అడ్డుకోవచ్చు. 

ట్రాన్సాక్షన్ హిస్టరీ చెక్..
కార్డ్ బ్లాక్ చేసిన తర్వాత.. మీ అకౌంట్‌కు సంబంధించిన ఇటీవలి లావాదేవీలను చాలా జాగ్రత్తగా పరిశీలించండి. మీ అనుమతి లేకుండా, మీకు తెలియకుండా ఏవైనా అనుమానాస్పద పేమెంట్స్ జరిగాయేమో చూసుకోండి. ఒకవేళ మీ దృష్టికి రాకుండా ఏదైనా మోసం జరిగినట్లు గుర్తిస్తే.. వెంటనే ఆ విషయాన్ని బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లి 'డిస్ప్యూట్ రిజల్యూషన్' కోసం రిపోర్ట్ చేయాలి.

బ్యాంకుకు అధికారికంగా సమాచారం..
కార్డ్ బ్లాక్ చేయడంతో పాటు, మీ క్రెడిట్ కార్డ్ పోయిన విషయాన్ని బ్యాంకుకు అధికారికంగా తెలియజేయడం చాలా ముఖ్యం. దీంతో మీ ఫిర్యాదును రికార్డుల్లో నమోదు చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా తదుపరి ప్రక్రియలో మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా బ్యాంక్ సిబ్బంది గైడ్ చేస్తారు. కొత్త రీప్లేస్‌మెంట్ కార్డ్ కోసం ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి వాళ్లు హెల్ప్ చేస్తారు. 

►ALSO READ | సెబీ ముందుకు జియో మెగా ఐపీఓ: అంబానీ కీలక ప్రకటన.. మార్కెట్లోకి 27 కోట్ల కొత్త షేర్లు

పాత కార్డ్ పూర్తిగా బ్లాక్ అయిన తర్వాత.. కొత్త క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకులు పాత నంబర్‌తో కాకుండా, పూర్తి భద్రత కోసం సరికొత్త నంబర్, సీవీవీతో కొత్త కార్డును జారీ చేస్తాయి. కొత్త కార్డ్ కోర్టు అప్లై చేసిన కొన్ని రోజుల్లోనే ఈ కొత్త కార్డ్ మీ ఇంటికి డెలివరీ చేయబడుతుంది.

కొత్త కార్డ్ వచ్చినా ఇవి గమనించండి..
కార్డ్ బ్లాక్ చేసి కొత్తది తీసుకున్నంత మాత్రాన మీ బాధ్యత తీరిపోలేదు. భద్రత కోసం మీ క్రెడిట్ స్కోర్ లేదా క్రెడిట్ రిపోర్టును క్రమం తప్పకుండా చెక్ చేస్తూ ఉండాలి. మీ కార్డ్ వివరాలను ఉపయోగించి ఎవరైనా భవిష్యత్తులో మోసాలకు పాల్పడినా లేదా ఆలస్యంగా ఏవైనా తప్పుడు ఎంట్రీలు జరిగినా క్రెడిట్ రిపోర్ట్ ద్వారా సులభంగా పట్టుకోవచ్చు. సమయానికి స్పందించి మీ ఆర్థిక భద్రతను కాపాడుకోవచ్చు.