అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ వచ్చేసింది : స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ పై భారీ డీల్స్‌, డిస్కౌంట్లు !

 అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ వచ్చేసింది : స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ పై భారీ డీల్స్‌, డిస్కౌంట్లు !

భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అమెజాన్  'గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026'ను ఆగస్టు 7 నుండి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఇయర్‌ఫోన్‌లు  ఇతర గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ముఖ్యంగా ప్రముఖ మొబైల్ బ్రాండ్లపై అమెజాన్ ఇప్పటికే కొన్ని హాట్ డీల్స్‌  వెల్లడించింది.

 స్మార్ట్‌ఫోన్స్ పై  ఆఫర్లు:
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రా అయినా ఈ లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ అసలు ధర రూ. 1,99,999 కాగా, ఫ్రీడమ్  సేల్‌లో  రూ.1,90,999కే లభిస్తుంది. అంటే దీనిపై మొత్తం రూ. 9,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

 స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, పవర్ ఫుల్ కెమెరాలతో వస్తున్న ఈ వన్‌ప్లస్ 15 ఫోన్  అసలు ధర రూ. 89,999. అయితే సేల్‌లో  రూ. 81,999 ధరకే లభించనుంది.

 వీటితో పాటు ఇతర ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ M47 5G ఫోన్‌లపై కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి.

బడ్జెట్ & మిడ్-రేంజ్ ఫోన్‌లపై ఆఫర్లు:
కేవలం పెద్ద ఫోన్‌లే కాకుండా, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే బడ్జెట్ ఫోన్‌లపై కూడా డిస్కౌంట్లు ఉన్నాయి. ముఖ్యంగా... వన్‌ప్లస్ 13ఎస్, రెడ్‌మీ A7 ప్రో 5G, ఐకూ Z11 లైట్, రియల్‌మీ నార్జో 100X 5G, ఐకూ 15R, వన్‌ప్లస్ నార్డ్ CE 6 వంటి చాల  మోడళ్లపై కంపెనీ భారీ డిస్కౌంట్స్  ప్రకటించింది.

ALSO READ : ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఎక్స్ట్రా బ్యాంక్ ఆఫర్లు & క్యాష్‌బ్యాక్:
ఈ సేల్ సమయంలో ఇంకా ఎక్కువ డబ్బు సేవింగ్స్ చేసుకోవడానికి మరికొన్ని ఆఫర్లను కూడా ఇచ్చింది:

HDFC బ్యాంక్ ఆఫర్ కింద HDFC క్రెడిట్ కార్డ్, EMI  ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

అమెజాన్ పే యూపీఐ కింద  యూపీఐ ద్వారా చెల్లింపులు చేసేవారికి ఎక్స్ట్రా  రూ. 150 క్యాష్‌బ్యాక్ వస్తుంది.

అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డ్ ఉన్నోళ్లు ఈ కార్డు ఉపయోగించే వారికి 5 శాతం ఆన్ లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది.

ఈ ప్రకటించిన ధరల్లోనే బ్యాంక్ డిస్కౌంట్లు కలిసి ఉంటాయని, వీటితో పాటు అదనంగా ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కూడా పొందవచ్చని అమెజాన్ స్పష్టం చేసింది.