తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి బ్యాగ్ పోగొట్టుకున్న భక్తుడు... అప్పగించిన కమాండ్ కంట్రోల్ సిబ్బంది...

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి బ్యాగ్ పోగొట్టుకున్న భక్తుడు... అప్పగించిన కమాండ్ కంట్రోల్ సిబ్బంది...

తిరుమల కమాండ్ కంట్రోల్ సెంటర్ చొరవతో శ్రీవారి భక్తుడు పోగొట్టుకున్న బ్యాగ్ అప్పగించారు. శనివారం ( జూన్ 20 ) తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన తెలంగాణకు చెందిన భక్తుడు వంగ మల్లేష్ గౌడ్ అలిపిరి చెక్ పాయింట్ దగ్గర తన బ్యాగ్ ను పోగొట్టుకున్నాడు. వెంటనే తిరుపతి కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఫిర్యాదు చేశాడు. భక్తుడి ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బ్యాగును తీసుకెళ్లిన వాహనాన్ని గుర్తించి తిరుమల కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సంప్రదించాలని సూచించారు.

ఈ క్రమంలో మల్లేష్ గౌడ్ తిరుమల కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఫిర్యాదు చేయగా... వెంటనే స్పందించిన సిబ్బంది వాహనాన్ని ట్రేస్ చేసి  ఇవాళ తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో బాలాజీ గెస్ట్ హౌస్ నెం:4 దగ్గర సదరు వాహనంలోని భక్తులను గుర్తించారు.వారిలో శ్రీ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, స్కానింగ్ సమయంలో పొరపాటున ఆ బ్యాగు తమ వద్దకు వచ్చిందని, స్వామివారి దర్శనం కోసం వచ్చినట్లు తెలిపారు. 

ALSO READ : శ్రీవారి సేవలో నందమూరి మోక్షజ్ఞ.. టాలీవుడ్ ఎంట్రీకి ముహూర్తం దగ్గరపడిందా?

అనంతరం బ్యాగును పరిశీలించగా అందులోని అన్ని వస్తువులతో పాటు 50 గ్రాముల బంగారం కూడా యథాతథంగా ఉండటంతో, బ్యాగును శ్రీ వంగ మల్లేష్ గౌడ్‌కు అప్పగించారు.ఈ సందర్భంగా భక్తుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది చొరవ, అప్రమత్తతకు కృతజ్ఞతలు తెలిపారు.