Mokshagna: శ్రీవారి సేవలో నందమూరి మోక్షజ్ఞ.. టాలీవుడ్ ఎంట్రీకి ముహూర్తం దగ్గరపడిందా?

Mokshagna: శ్రీవారి సేవలో నందమూరి మోక్షజ్ఞ.. టాలీవుడ్ ఎంట్రీకి ముహూర్తం దగ్గరపడిందా?

నందమూరి బాలకృష్ణ (Balakrishna) కుమారుడు నందమూరి మోక్షజ్ఞ (Mokshagna) టాలీవుడ్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. గత రెండేళ్ల క్రితమే ప్రశాంత్ వర్మ (Prasanth Varma) డైరెక్షన్లో తన మొదటి సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది. కానీ, ఆ ప్రాజెక్ట్ ఉన్నట్టుండి ఆగిపోవడంతో మోక్షజ్ణ ఎంట్రీ ఆలస్యమవుడుతూ వచ్చింది. అందుకు పలు కారణాలు ఉన్నప్పటికీ, మోక్షజ్ణ సాలిడ్ ఎంట్రీ కోసం మాత్రం నందమూరి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అందరి చూపులకు ఎండ్ కార్డు పడే సమయం వచ్చేసిందని సినీ వర్గాలు సమాచారం.

ఈ సందర్భంలోనే బాలకృష్ణ నట వారసుడు నందమూరి మోక్షజ్ణ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం విశేషంగా మారింది. ఇవాళ శనివారం జూన్ 20, 2026న విఐపి విరామ సమయంలో మోక్షజ్ణ శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర, దేశ ప్రజలు క్షేమంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతుండటంతో మోక్షజ్ణ ఎంట్రీకి సమయం వచ్చేసిందంటూ సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అంతేకాకుండా బాలకృష్ణ తన వారసుడిని సినీ రంగంలోకి పరిచయం చేసేందుకు ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, మోక్షజ్ఞ నుంచి ఫస్ట్ వచ్చేది ప్రశాంత్ వర్మ సినిమానా? లేక వేరే దర్శకుడితో వస్తున్నారా? అనే అంశాలపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.