యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన లేటెస్ట్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్లాస్ట్’ (BLAST). తెలుగులో ‘బ్లాస్ట్ జోన్’గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. మే 28, 2026న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా రూ.70కోట్లకి పైగా వసూళ్లు సాధించి సూపర్ సక్సెస్ అయింది.
తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా, ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్ సినిమాను గట్టెక్కించింది. థియేటర్లలో భారీ వసూళ్లతో దుమ్మురేపిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి వస్తోంది. జూన్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి ఒకే రోజు అందుబాటులోకి రానుంది.
📢 Official Announcement 🔥
— OTT Trackers (@OTT_Trackers) June 20, 2026
Recent Blockbuster 🥵#Blast (Tamil) Streaming from June 25 on Netflix in Tamil, Telugu, Kannada, Malayalam & Hindi 🍿!!#OTT_Trackers pic.twitter.com/dSo7PniapH
దుమ్మరేపిన బ్లాస్ట్ వసూళ్లు:
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నటించిన ‘బ్లాస్ట్’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. రూ.20 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ కమర్షియల్ విజయాన్ని అందుకుంది. బ్రేక్ ఈవెన్ మార్క్‌ను సులభంగా దాటిన ఈ మూవీ, ఇండియాలోనే దాదాపు రూ.50 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. ఇందులో ఇండియా నెట్ కలెక్షన్లు సుమారు రూ.49.20 కోట్లు కాగా, ఇండియా గ్రాస్ రూ.56.55 కోట్లుగా నమోదైంది. విదేశీ మార్కెట్ల నుంచి మరో రూ.14.05 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
ALSO READ : హీరో, హీరోయిన్ కాదు కంటెంట్ ముఖ్యం..
కథేంటంటే?
అర్జున్, ఆయన భార్య అభిరామి, కూతురు నీల (ప్రీతి ముకుందన్) బయట ప్రపంచానికి చాలా సాదాసీదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలా కనిపిస్తారు. కానీ, ఈ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వింటే రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎందుకంటే ఈ ముగ్గురూ కిల్లర్ 'కరాటే మాస్టర్లే'. కూతురు నీలను చిన్నప్పటి నుంచే సమాజంలో ఒంటరిగా పోరాడేలా, ధైర్యంగా పెంచుతారు. అయితే, ఊహించని విధంగా ఓ పెద్ద బిజినెస్ మ్యాన్, లోకల్ గూండాతో ఈ ఫ్యామిలీకి గొడవ మొదలవుతుంది. తమ జోలికి వచ్చిన ఆ గ్యాంగ్‌స్టర్స్‌ను ఈ సైలెంట్ అండ్ వయలెంట్ ఫ్యామిలీ ఎలా బ్లాస్ట్ చేసింది? అసలు ఆ గూండాల వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? అనేదే మిగతా ఇంట్రెస్టింగ్ స్టోరీ.
