టాలీవుడ్ నటి సమంత ప్రధాన పాత్రలో నటించి, స్వయంగా నిర్మించిన ఈ లేడీ ఓరియెంటెడ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా 'మా ఇంటి బంగారం'. భారీ అంచనాలతో మధ్య జూన్ 19న థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో ప్రేక్షకులను థియేటర్ల వైపు పరుగులు పెట్టిస్తోంది. మొదటి రోజు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వరల్డ్‌వైడ్ ఏకంగా 13 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ భారీ విజయంపై సమంత సోషల్ మీడియా వేదికగా ఎంతో ఎమోషనల్ అవుతూ ఒక పోస్ట్‌ను షేర్ చేసింది.
మొదటి రోజే సినిమాకు ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం చూస్తుంటే మాటలు రావడం లేదు. ఇది మమ్మల్ని ఎంతో సంతోషాన్ని నిపిందని సమంత పేర్కొంది. సినిమాకు హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు అని చూడకుండా.. కేవలం కంటెంట్‌ను నమ్మి ప్రేక్షకులు ఆదరించడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. థియేటర్లలో యువత నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ సందడి చేయడం అద్భుతం. అన్నిటికంటే ముఖ్యంగా, సాధారణంగా థియేటర్ ఓపెనింగ్స్ అంటే కేవలం పురుష ప్రేక్షకులకే పరిమితం అనే టాక్ ఉండేది.
కానీ 'మా ఇంటి బంగారం చిత్రానికి మహిళా ప్రేక్షకులు భారీగా తరలివచ్చి థియేటర్లను హౌస్‌ఫుల్ చేయడం నన్ను ఎంతగానో కదిలించింది. సినిమా పట్ల ప్రేక్షకుల ఆలోచనా విధానం మారుతోంది. మా చిన్న నిర్మాణ సంస్థ విజయం సాధించింది! ట్రా-లా-లాaaaa..." అంటూ సమంత తన సంతోషాన్ని పంచుకుంది.
To see a film open so well on day one is hugely humbling and means the world to us.
— Samantha (@Samanthaprabhu2) June 20, 2026
So very glad to see the day when audiences embrace a film irrespective of whether it is male-led or female-led. And it’s beautiful to see people show up wholeheartedly - from the young to the… pic.twitter.com/555ZjHnWiY
దర్శకురాలు నందినీ రెడ్డి మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్, క్రియేటర్ రాజ్ నిడిమోరు స్క్రీన్‌ప్లే మ్యాజిక్, విలన్‌గా గుల్షన్ దేవయ్య పండించిన క్రూరత్వం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వీటికి తోడు సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో పూనకాలు తెప్పించింది. వీకెండ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద మరింత కలెక్షన్స్ పెరుగుతాయని మేకర్స్ ధీమాగా ఉన్నారు.
ఇటీవలే రష్మిక మందన్న నటించిన 'ది గర్ల్‌ఫ్రెండ్' విజయం సాధించగా, ఇప్పుడు సమంత 'మా ఇంటి బంగారం'తో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కంటెంట్ బాగుంటే ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుందని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. సమంత సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ నిర్మించిన ఈ తొలి చిత్రమే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో చిత్రబృందం ఫుల్ జోష్‌లో ఉంది.
