HCA టీజీ20 లీగ్ పై హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ టీసీఏ సెక్రెటరీ గురవారెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. గురవారెడ్డి BCCI మెంబెర్షిప్ కోసం ట్రై చేస్తే రాలేదని... గురవారెడ్డి దుకాణం బంద్ అయ్యిందనే ఇలా ప్రచారం చేస్తున్నాడని అన్నారు. తాను రూరల్ క్రికెట్ ను నాలుగు సార్లు స్పాన్సర్ చేశానని.. రెండున్నర కోట్లతో ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ చేశామని అన్నారు.
మేము నిరంతరం క్రికెట్ ను ప్రమోట్ చేస్తున్నామని..నాకు HCAతో ఎలాంటి సంబంధం లేదని.. వచ్చే నెలలో HCAలో సభ్యత్వం వస్తుందని అన్నారు. స్పాన్సర్ చేసినప్పుడ విశాఖ క్రికెట్ ఇంటర్నేషనల్ స్టేడియం అని పేరు పెడతాం అన్నారని.. ఆ తర్వాత పేరును రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం గా పెడుతామని వైఎస్ఆర్ మార్పు చేశారని అన్నారు.పేరు లేనందుకు వాళ్ళు చెప్పిన అమౌంట్ స్టేడియం నిర్మాణానికి ఇచ్చామని అన్నారు మంత్రి వివేక్.
కావాలనే ఇన్నాళ్లు కేసును ప్రోలాంగ్ చేస్తూ వచ్చారని..లేట్ చేసిన కొద్దీ ఇంట్రెస్ట్ పెరిగి HCA కే నష్టం జరుగుతుందని అన్నారు. ఇకముందు స్పాన్సర్ షిప్ ఆలోచన తనకు లేదని.. కానీ గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివ్రుద్ది కి కృషి చేస్తూనే ఉంటామని అన్నారు.
