విశ్వక్ సేన్కు సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య

విశ్వక్ సేన్కు సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య

నందమూరి నటసింహం బాలకృష్ణ(Nandamuri Balakrishna) మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak sen) కు సడన్ షాకిచ్చాడట. విశ్వక్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ అఫ్ గోదావరి(Gangs of godavari). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. దర్శకుడు కృష్ణ చైతన్య(Krishna chaitanya) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో డీజే టిల్లు(DJ Tillu) బ్యూటీ నేహా శెట్టి(Neha shetty) హీరోయిన్ గా నటిస్తోంది. మరో బ్యూటీ అంజలి(Anjali) కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన టీజర్, ఒక సాంగ్ కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vishwak Sen (@vishwaksens)

అయితే తాజాగా గ్యాంగ్ ఆఫ్ గోదావరి సెట్ లో మెరిసి సర్ ప్రైజ్ ఇచ్చాడట బాలయ్య. ఇదే విషయాన్నీ విశ్వక్ తన సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ తో పంచుకున్నాడు. గ్యాంగ్ ఆఫ్ గోదావరి సెట్ లో మన బాలయ్య గారు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. మీ అద్భుతమైన సపోర్ట్ కు చాలా థాంక్స్ సర్. నేను ఎప్పటికీ మిమల్ని ప్రేమిస్తూనే ఉంటాను. మీ రాకతో మా యూనిట్ లో జోష్ మరింత పెరిగింది.  బాలయ్య బాబు.. ఫైర్ అంతే అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం బాలయ్యతో విశ్వక్ ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.