జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తీసేయించిన బాలకృష్ణ

జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తీసేయించిన బాలకృష్ణ
  • బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య ఫ్లెక్సీవార్
  • ఎన్టీఆర్ ఘాట్ వద్ద పరిణామం
  • అప్పుడు బాబు అరెస్టుపై కారణమా
  • నందమూరి ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? 

హైదరాబాద్:నందమూరి ఫ్యామిలీ విభేదాలకు ఎన్టీఆర్ ఘాట్ వేదికైంది. జనవరి 18న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకొని ఉదయాన్నే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్​ రామ్ వచ్చి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ పేర్లతో వారి ఫ్యాన్స్ భారీ ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. తండ్రికి నివాళులు అర్పించటానికి వచ్చిన బాలయ్య.. వాటిని చూసి ఫైర్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రాం పేర్లతో ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లను ఘాట్ నుంచి వెంటనే తొలగించాలంటూ ఆదేశించారు. దీంతో ఆయన శ్రద్ధాంజలి ఘటించి వెళ్లిపోయిన క్షణాల వ్యవధిలో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఫ్లెక్సీలను సిబ్బంది తొలగించారు.  ఘాట్ ఆవరణ నుంచి తీసుకెళ్లి రోడ్డుపై పడేశారు.

ఈ పరిణామంతో ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బాలయ్య కన్ను సైగతోనే ఫ్యాన్స్ రెచ్చిపోయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించారని తెలుస్తోంది. ఈ పరిణామంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.  తాతకు తగ్గ మనవడిగా.. ఆస్కార్ నటుడిగా ఎంతో గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్ కు నందమూరి కుటుంబం ఇచ్చే విలువ ఇదేనా? అనే కామెంట్స్ వస్తున్నాయ్. 
గతంలో చంద్రబాబు అరెస్ట్‌ విషయంలో నందమూరి వంశానికి చెందిన జూనియర్ ఎన్టీయార్ మౌనంగా ఉండిపోవడంతో నందమూరి, నారా కుటుంబాలకు పెద్ద షాకే ఇచ్చింది. ఆ విషయంలో తారక్‌ స్పందించకపోవడంతో ఆయనపై  బాలకృష్ణ బహిరంగంగానే ఐ డోంట్‌ కేర్‌ అంటూ ఫైర్‌ అయిన విషయం తెలిసిందే. కేవలం చంద్రబాబుకు రాజకీయంగా మద్దతు ప్రకటించనంత మాత్రాన జూనియర్ ఎన్టీఆర్ ను ఇలా అవమానిస్తారా..? అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 

జూనియర్ ఎన్టీఆర్ కేవలం తన సినీ కెరీర్ పైనే దృష్టి పెట్టారు.  ఇదిలా ఉండగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఈ పరిణామాలపై స్పందించారు. ‘జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించమని ఎవరు చెప్పినా నీచాతి నీచమైన విషయం. ఎన్టీఆర్ పేరు చెప్పి భజన చేసుకునే కుటుంబసభ్యులు.. పెద్ద ఎన్టీఆర్ ను చంద్రబాబు కోసం తీసేశారు. ఇప్పుడు అల్లుడు లోకేష్ కోసం బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కు ద్రోహం చేస్తున్నాడు. ఇలాంటి కుటుంబసభ్యులు, మిగతావారు ఎంతమంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయిన వెంట్రుక కూడా పీకలేరు’ అంటూ ఫైర్ అయ్యారు.