ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం... ఇండ్ల మధ్య ఫ్యాక్టరీలో మంటలు.. పిల్లలతో సహా బిల్డింగ్ పై నుంచి దూకిన ఆరుగురు వ్యక్తులు 

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం... ఇండ్ల మధ్య ఫ్యాక్టరీలో మంటలు.. పిల్లలతో సహా బిల్డింగ్ పై నుంచి దూకిన ఆరుగురు వ్యక్తులు 

దేశరాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇండ్ల మధ్య ఓ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు చెలరేగి పక్కను జనవాసాలకు వ్యాపించాయి. ఫ్యాక్టరీలో ఎవరూ లేనప్పటికీ  పక్క భవనంలో ఉన్నవారు మంటల్లో చిక్కుకున్నారు. మంటలు వ్యాపిస్తుండటంతో పిల్లలు, మహిళతో సహా ఆరుగురు బిల్డింగ్ పైనుంచి కిందకు దూకారు. ఈ ఘటనలో వారికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న  ఫైర్ సిబ్బంది 15 ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. వాయువ్య ఢిల్లీలో ని సరూప్ నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల  ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాదంలో 40 మంది చనిపోయిన ఘటన మరువకు ముందే తాజాగా ఈ ఘటన జరగడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. 

ఆదివారం ఉదయం 12గంటల సమయంలో స్వరూప్ నగర్ లోని బాక్సింగ్ గ్లోవ్స్  తయారు చేసే కంపెనీలు ఒక్కసారిగా మంటల చెలరేగాయి.  ఫ్యాక్టరీ గ్రౌండ్  ఫ్లోర్,మొదటి అంతస్తులో   ప్రమాదం జరిగటింది. ఈ ఘటన సమయంలో ఫ్యాక్టరీలో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది.   అయితే ఫ్యాక్టరీ పక్కనే ఉన్న  భవనంలో నివసిస్తున్న  కొందరు భయంతో పరుగులు పెట్టారు. కొంతమంది మహిళలు,పిల్లలతో సహా  కిందకు దూకారు. ఈ ఘటనలో పిల్లలతో సహా ఆరుగురు  గాయపడినట్ల స్థానిక పోలీసులు తెలిపారు. గాయపడిన వారందరినీ సమీప ఆస్పత్రులకు తరలించారు.