- కేటీఆర్ అధికారంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని ఫైర్
హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని విప్ బల్మూరి వెంకట్ ఆరోపించారు. ఆయన ఇంకా అధికారంలో ఉన్నట్లు, తానే మంత్రిని అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. శనివారం సీఎల్పీ మీడియా సమావేశంలో మాట్లాడారు. సనత్ నగర్ టిమ్స్ కు కేటీఆర్ జనాన్ని తీసుకెళ్లి షో చేశారని, అధికారం పోయాక అన్ని తామే చేసినట్లు హడావిడి చేస్తున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో టిమ్స్ కు కేవలం శంకుస్థాపన మాత్రమే చేశారని, ఆ పనులన్నీ తామే పూర్తి చేశామన్నారు. జూన్ 2న సనత్ నగర్ టిమ్స్ ను ప్రారంభించబోతున్నామని, ఈ విషయం తెలిసి కేటీఆర్ ఆందోళనకు గురవుతున్నారని మండిపడ్డారు.
