హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు వచ్చింది. శుక్రవారం( మే15) సాయంత్రం ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన గచ్చిబౌలిలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు బండి సంజయ్ కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఎమర్జెన్సీలో చికిత్స పొందుతున్న ఆమె గుండెకు స్టంట్స్ వేసి అత్యవసర చికిత్స అందిస్తున్న ట్లు డాక్టర్లు తెలిపారు. తల్లి ఆరోగ్య పరిస్థితిపై బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే మెడికవర్ ఆస్పత్రికి చేరుకున్నారు. మాతృమూర్తి ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు కేంద్ర మంత్రి బండి సంజయ్.
మరోవైపు బండి భగీరథ్ కేసులో బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో కొనసాగుతోంది. భగీరథ్ తరపున లాయర్ నిరంజన్ రెడ్డి వాదిస్తున్నారు.కొద్దిగంటల్లో బెయిల్ వస్తుందా రాదా అనే విషయం తేలనుంది. ఈ క్రమంలో తన తల్లికి గుండెపోటు రావడంపై బండి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
మైనర్ పై అత్యాచారం కేసులో బండి భగీరథ్ పై పోక్సో కేసు పెట్టారు బాధితురాలి తల్లి.. గత కొద్దిరోజులుగా ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది.
