వాళ్లు స్టూడెంట్లు కాదు.. పోలీసులు ఫైరింగ్ చేయలేదు: కేంద్ర మంత్రి బండి సంజయ్

వాళ్లు స్టూడెంట్లు కాదు.. పోలీసులు ఫైరింగ్ చేయలేదు: కేంద్ర మంత్రి బండి సంజయ్

నీట్​ పేపర్​ లీకేజీ వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్​ తొలిసారి స్పందించారు. నీట్​పేపర్​ లీకేజీ విషయంలో  కేంద్రం వేగంగా చర్యలు చేపట్టింది. విద్యార్థులు నష్ట పోవద్దని  48 రోజుల్లో మళ్లీ ఎగ్జామ్ పెట్టామన్నారు. ఢిల్లీలో దీక్ష చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్​ కూడా ఇచ్చిందన్నారు. విద్యార్థులు ముసుగులో కొందరు సంఘ విద్రోహ శక్తులు  చేరాయని ఆరోపించారు. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని అన్నారు.  ఆందోళనల్లో 118 మంది పోలీసులు గాయపడ్డారు. అయినప్పటికీ  పోలీసులు సంయమనం పాటించారని చెప్పుకొచ్చారు బండి సంజయ్​. 

ఆందోళన లకు సంబంధించిన న్యూస్​ స్ర్పెడ్ చేస్తున్న 480 పాకిస్తాన్​ సోషల్ మీడియా  అకౌంట్లను బ్లాక్​ చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​ అన్నారు. ఆందోళనల్లో గాయపడినవారిలో ఎవరూ విద్యార్థులు లేరని చెప్పారు. ఆందోళన సందర్భంగా ఆర్టికల్ 370  ప్రస్తావన వచ్చింది. . నీట్​ కు ఆ ఆర్టికల్ ను సంబంధం ఏంటని ప్రశ్నించారు మంత్రి. 

విద్యార్థులకోసమే ప్రధాని మోదీ నిత్యం ఆలోచిస్తున్నారని అన్నారు బండి సంజయ్, నీట్​ లీకేజీపై కేంద్ర విద్యాశాఖ  మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ కూడా క్షమాపణాలు చెప్పారని .. విచారణ జరపాలని సీబీఐ కూడా లేఖ రాశారని అన్నారు. 

 పేపర్​ లీకేజీ వివాదంపై తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్​ స్పందించారు.  కాంగ్రెస్​ పాలనలో టెన్త్​  తెలుగు, హిందీ పేపర్లు కూడా లీకయ్యాయి. గ్రూప్​ 1 లో అక్రమాలు జరిగాయి.. 4 లక్షల మంది నిరుద్యోగుల భవిషత్తు నాశనమైంది.. వారెందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు మంత్రి.  గ్లోబరీనా గురించి మాట్లాడుతున్న సీఎం...ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు సూత్రధారాలైన వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయడం లే దని అన్నారు కేంద్రమంత్రి బండిసంజయ్.