బడ్జెట్ లో జనాభా ప్రకారం ఫండ్స్ కేటాయించాలి : బీసీ ఇంటలె క్చువల్ ఫోరం నేతలు

బడ్జెట్ లో  జనాభా ప్రకారం ఫండ్స్ కేటాయించాలి : బీసీ ఇంటలె క్చువల్ ఫోరం నేతలు
  •     మంత్రి పొన్నంకు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం విజ్ఞప్తి

హైదరాబాద్ ,వెలుగు: బడ్జెట్ లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు నిధులు కేటాయించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నేతలు కోరారు. మంగళవారం సెక్రటెరియేట్ లో మంత్రి పొన్నంను  సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు ప్రొ. మురళి మనోహర్,  తెలంగాణ బ్యాక్ వర్డ్ క్లాస్  ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ దేవళ్ల సమ్మయ్య, పీసీసీ ఓబీసీ కన్వీనర్ డా. కేతూరి వెంకటేశ్ కలిసి వినతిపత్రం అందచేశారు. బీసీలకు కుడా సబ్ ప్లాన్ అమలు  చెయ్యాలని మంత్రిని నేతలు కోరారు .

ఈ మేరకు  కామారెడ్డిలో బీసీ  డిక్లరేషన్ ప్రకటించిన విధంగా ప్రతి ఆర్థిక సంవత్సరానికి రూ.20 వేల  కోట్లు కేటాయిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారని నేతలు గుర్తు చేశారు. రెండేళ్ల బడ్జెట్ లో రూ. 20 వేల కోట్లు కేటాయిస్తే, రూ. 2300 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారన్నారు. కులగణనలో 56 శాతం బీసీలు ఉన్నా.. నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతుందని నేతలు గుర్తు చేశారు. బీసీ కులవృత్తుల ఉపాధి కోసం సబ్ ప్లాన్ ను తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.