- ఎంబీసీ కార్పొరేషన్ సీఈవో అలోక్ కుమార్
హైదరాబాద్, వెలుగు: ఆషాడ బోనాల సందర్భంగా హెచ్ఎండీఏ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బీసీ కులవృత్తుల మేళా ఆదివారం ముగిసింది. 11 రోజుల పాటు 60 స్టాల్స్ ఏర్పాటు చేశామని, నిత్యం 2 వేల మంది సందర్శించి వివిధ వస్తువులను కొనుగోలు చేశారని ఎంబీసీ కార్పొరేషన్ సీఈవో అలోక్ కుమార్ వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాలమాయదేవి సహకారంతో మేళా సక్సెస్అయిందన్నారు.
కమ్మరి, వడ్రంగి, మేదరి తదితర బీసీ చేతివృత్తుల ఉత్పత్తులకు విస్తృత ప్రచారం, మార్కెటింగ్ అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఎగ్జిబిషన్ విజయవంతానికి కృషి చేసిన సెర్ఫ్ అధికారులు, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల అధికారులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
