V6 News

ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కు టీమిండియా ఎంపిక

ఇంగ్లాండ్ తో  వన్డే సిరీస్ కు టీమిండియా ఎంపిక

ఇంగ్లాండ్ తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కు టీంను ప్రకటించింది ఇండియా. టీ20తో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టార్ట్ చేసిన సూర్యకుమార్ యాదవ్ కు తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాకు, బౌలర్ ప్రసిద్ధ కృష్ణకు వన్డే జట్టులో మొదటి సారి చోటు దక్కింది. మార్చి 23 నుంచి జరగనున్న మూడు వన్డేలకు 18 మంది ఆటగాళ్ల లిస్ట్ ను ప్రకటించింది. విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా,  రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎల్ రాహుల్ (వికె), యజువేంద్ర చాహల్ , కుల్దీప్ యాదవ్,  కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, టి.నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ఎండి. సిరాజ్, పి కృష్ణ, శార్దూల్ ఠాకూర్. మహారాష్ట్ర పుణెలో  23, 26, 28 మూడు వన్డేలు జరగనున్నాయి.