BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పదవికాలం ప్రస్తుత నిబంధనల ప్రకారం 9నెలలు మాత్రమే ఉంది. అయితే గంగూలీ పదవికాలాన్ని పొడిగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండోసారి గంగూలీ పదవిలో కొనసాగాలంటే మూడేళ్ల విరామం తప్పనిసరి. ఈ క్రమంలో BCCI అధికార వర్గం ఆ నిబంధనను తొలగించాలనుకుంటోంది. ఈ ప్రతిపాదనకు BCCI లో నాలుగింట మూడో వంతు మద్దతు అవసరం. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఆమోదం కూడా తప్పనిసరి. కోర్టు అనుమతి వస్తే గంగూలీ ఆరేళ్లపాటు అధ్యక్షుడి పదవిలో కొనసాగనున్నాడు. సుప్రీంకోర్టు ఆమోదించిన బిసీసీఐ రాజ్యాంగాన్ని సాధారణ వార్షిక సమావేశంలో సవరించాలని అంతా భావిస్తున్నట్లుగా సమాచారం. డిసెంబర్‌లో జరిగే ఈ సమావేశానికి సౌరవ్ గంగూలీ నేతృత్వం వహించనున్నారు.


