V6 News

పారిశుద్ధ్య కార్మికునిపై ఎలుగుబంటి దాడి

పారిశుద్ధ్య కార్మికునిపై ఎలుగుబంటి దాడి

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం పరిధిలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. సంగోజివాడి గ్రామానికి చెందిన బాల్ సాయిలు అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో అతడికి తీవ్ర గాయాలైయ్యాయి. సాయిలును చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య కార్మికునిగా సాయిలు పని చేస్తున్నాడు.

స్థానికులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన గ్రామానికి చేరుకొని ఎలుగుబంటి కోసం రెస్క్యూ టీమ్ ను ఏర్పాటు చేశారు అటవీ అధికారులు. గ్రామంలోని చెరువు సమీపంలో ఎలుగుబంటి సంచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలుగుబంటి సంచారంతో గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.