న్యూజిలాండర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు బెన్ స్టోక్స్ నామినేట్

న్యూజిలాండర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు బెన్ స్టోక్స్ నామినేట్

వరల్డ్ కప్ ను ఇంగ్లండ్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్… ‘న్యూజిలాండర్ ఆఫ్ ది ఇయర్’గా నామినేట్ అయ్యాడు. ఫైనల్స్ లో 84 పరుగులు చేసిన స్టోక్స్… ప్రపంచకప్ లో 465 పరుగులు సాధించాడు. ఇంగ్లండ్ తరపున క్రికెట్ ఆడుతున్న బెన్ స్టోక్స్.. న్యూజిలాండ్ పౌరుడు. మరోవైపు, న్యూజిలాండ్ కెప్టెన్ విలియంసన్ కూడా ఈ అవార్డుకు నామినేట్ అయ్యాడు. న్యూజిలాండ్ తరపున ఆడకపోయినా బెన్ స్టోక్స్ తమ దేశస్తుడేనని… న్యూజిలాండర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల చీఫ్ జడ్జ్ కామెరాన్ బెన్నెట్ అన్నారు. క్రైస్ట్ చర్చ్ లో స్టోక్స్ జన్మించాడని, అతని తల్లిదండ్రులు ఇక్కడే ఉంటున్నారని తెలిపారు.

న్యూజిలాండర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు 15 ఏళ్లు పైబడినవారు అర్హులు. నామినేట్ అయిన వారిలో తుది 10 మందిని డిసెంబర్ లో ప్రకటిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే న్యూజిలాండర్ ఆఫ్ ది ఇయర్ వేడుకలో విజేతను ప్రకటిస్తారు.