నడిరోడ్డుపై భార్యాభర్తల మీద కత్తులు, కర్రలతో దాడి చేసి పరారైన సైకో బ్యాచ్...

నడిరోడ్డుపై భార్యాభర్తల మీద కత్తులు, కర్రలతో దాడి చేసి పరారైన సైకో బ్యాచ్...

ఒడిశాలో దారుణం జరిగింది... నడిరోడ్డుపై ఓ యువజంటపై కత్తులు, కర్రలతో దాడి చేశారు సైకో బ్యాచ్. ఓడిశాలోని బరంపూర్ లో  జరిగింది ఈ ఘటన. సోమవారం ( మే 18 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. బరంపూర్ లోని బైద్యనాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిరి రోడ్ లో ఓ యువ జంటపై కత్తులు, కర్రలతో దాడికి దిగారు సైకో బ్యాచ్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

బరంపూర్ కి చెందిన ఉమేష్ రాత్, అతని భార్యతో కలిసి వెళ్తుండగా.. ఆశిష్ సాహు, ముఖేష్ సాహు సహా ఐదుగురు సైకోలు ఉమేష్ దాడికి దిగారు. అడ్డుకోబోయిన ఉమేష్ భార్యపై కూడా దాడి చేశారు దుండగులు. ఈ ఘటనలో ఉమేష్, అతని భార్య తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను MKCG ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

సుమారు 10 మంది వ్యక్తులు కర్రలు, కత్తులతో దాడి చేశారని బాధితుల కుటుంబసభ్యులు చెబుతున్నారు. దాడి సమయంలో కాల్పులు కూడా జరిపారని.. జనం గుమిగూడడంతో నిందితులు అక్కడి నుండి పారిపోయారని చెబుతున్నారు ఉమేష్ తల్లి.ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజీ ఆధారమగా నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.