భగవంత్ కేసరి ఉయ్యాలో ఉయ్యాలా సాంగ్ అప్డేట్.. ఎప్పుడంటే ?

భగవంత్ కేసరి ఉయ్యాలో ఉయ్యాలా సాంగ్ అప్డేట్.. ఎప్పుడంటే ?

నటసింహ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి(Bhagavanth Kesari). కాజల్ అగర్వాల్(Kajal Agarwal), శ్రీలీల(Sreeleela) కీ రోల్లో కనిపిస్తున్న ఈ సినిమా.. కోసం బాలయ్య అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

ప్రస్తుతం ఈ మూవీ నుంచి భగవంత్ కేసరి పాటల నగరా వినిపించడానికి మేకర్స్ రెడీ అయ్యారు. లేటెస్ట్గా ఈ సినిమా సెకండ్ లిరికల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. భగవంత్ కేసరి బంధాన్ని నిర్వచించేలా ఉయ్యాలో ఉయ్యాలా సాంగ్ ఉంటుందని పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ. అక్టోబర్ 4న ఈ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేయనున్నారు.

అలాగే పోస్టర్ లో కనిపిస్తోన్న బాలకృష్ణ..చిన్ని పాపా(Vijji Papa) (విజ్జి) మధ్య ఉన్న బంధాన్ని తెలిపేలా ఉయ్యాలా పాట..వర్ణన ఉంటుందని క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన గణేష్ ఫస్ట్ సింగిల్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 

ఈ మూవీ అక్టోబర్ 19న రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలో భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా కండక్ట్ చేయడానికి అనిల్ రావిపూడి రెడీ అయ్యినట్టు టాక్. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన టీజర్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఫస్ట్ ఊరమాస్ ఫిల్మ్ బాలయ్యతో కావడం విశేషం.  

ఇక భగవంత్ కేసరి సినిమా విషయానికి వస్తే..షైన్ స్క్రీన్(Shine screen) పతాకంపై సాహు గరికపాటి(Sahu garikapati) నిర్మిస్తున్న ఈ సినిమాలో.. కాజల్ అగర్వాల్(Kajal Agarwal) హీరోయిన్ గా నటిస్తుండగా..లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) బాలకృష్ణకు కూతురిగా కనిపించనుంది. తమన్(Thaman) సంగీతం అందిస్తున్న ఈ సినిమా..2023 అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.