బిగ్‌బాస్ సీజన్ 7 ఇవాల్టినుండే.. ఈసారి అంతా ఉల్టా.. పుల్టా?

బిగ్‌బాస్ సీజన్ 7 ఇవాల్టినుండే.. ఈసారి అంతా ఉల్టా.. పుల్టా?

బుల్లితెరపై బిగ్‌బాస్ సీజన్ 7(Bigg boss season 7) సందడి నేడు (సెప్టెంబర్ 3) నుండి మొదలుకానుంది. ఎప్పటిలాగే స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ కానున్న ఈ షో మొదటిరోజు అంతా ఓపెనింగ్ సెర్మనీ ఉంటుంది కాబట్టి షో సాయంత్రం 7 గంటలకు మొదలు కానుంది. హోస్ట్ నాగార్జున(Nagarjuna) ఎంట్రీ, బిగ్ బాస్ హౌస్ టూర్, స్పెషల్ డ్యాన్సులు, కంటెస్టెంట్స్ ల ఎంట్రీ వంటివి ఉండనున్నాయి. ఇక సోమవారం నుండి రాత్రి 9.30 గంటలకు టెలికాస్ట్ కానున్న ఈ షో.. శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటల నుండి మొదలవుతుంది. స్టార్ మా ఛానల్ లోనే కాకుండా డిస్నిప్లస్ హాట్ స్టార్(Disney Plus Hotstar) ఓటీటీలో 24 గంటల లైవ్ కూడా చూడొచ్చు. ఇక బిగ్ బాస్ సీజన్ 7కు కు సంబంధించిన ప్రారంభ ఎపిసోడ్ ఏర్పాట్లు అన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. 

అయితే ఈసారి బిగ్‌బాస్ సీజన్ 7లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వెళ్లే అంటూ ఒక లిస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో.. అమరదీప్, తేజస్విని, ఢీ డాన్సర్ పండు, జబర్దస్త్ అప్పారావు, ఆట సందీప్, యూట్యూబర్ శ్వేతా నాయుడు, యూట్యూబర్ నిఖిల్, యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల, హీరోయిన్ ఎస్తర్ నోరాన్హా, యాంకర్ శశి, సురేఖ వాణి, సుప్రీతా, జబర్దస్త్ కార్తిక్ ఈ లిస్టులో ఉన్నారు. అయితే ఈ లిస్టుపై అధికారిక ప్రకటన రాలేదు.