పాట్నా: ప్రధాని మోదీ పిలుపు నేపథ్యంలో బిహార్ సీఎం సామ్రాట్ చౌదరి శుక్రవారం తన అధికారిక నివాసం నుంచి 500 మీటర్ల దూరంలోని కేబినెట్ సచివాలయానికి నడిచి వెళ్లారు. సీఎం బాటలోనే విద్యాశాఖ మంత్రి మిథిలేష్ తివారీ ఈ రిక్షాలో ఆఫీసుకు చేరుకున్నారు.
సీఎం ఆదేశాల మేరకు తన కాన్వాయ్‌లోని వాహనాలను తగ్గించానని, కేబినెట్ సహచరులు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో వీలైనంత వరకు ‘వర్క్-ఫ్రమ్-హోమ్’ ప్రోత్సహించడం, వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’ పాటించడం వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
