కిలో రూ.35: బీహార్ లో ఉల్లిగడ్డలు కొనుక్కోవడానికి భారీ క్యూ

కిలో రూ.35: బీహార్ లో ఉల్లిగడ్డలు కొనుక్కోవడానికి భారీ క్యూ

ఉత్తర భారత దేశంలో ఉల్లి గడ్డల రేటు ఘాటును పెంచుతోంది. బీహార్ లో 500రూపాయలకు కిలో ఉల్లి గడ్డలు దొరుకుతుండగా.. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో 100రూపాయలకు కిలో ఉల్లి దొరుకుతుంది. బీహార్ లో మాత్రం ఉల్లి 500రూపాయలకు కిలో ఉండటంతో జనాలు వంట చేసుకొవడానికి బిత్తరపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దీంతో..  ఈ రోజు బీహార్ ప్రభుత్వం  పట్నాలో  ఉల్లిగడ్డలను 35రూపాయలకే అందిస్తుంది. ఇందుకు గాను బీహార్ స్టేట్ కార్పొరేటివ్ మార్కెటింగ్ యూనియన్ లిమిటెడ్ ద్వారా ఉల్లిగడ్డల కౌంటర్ పెట్టారు. ఇందులో 35రూపాయలకే కిలో ఉల్లిగడ్డలను అమ్ముతున్నారు. దీంతో కొనుక్కోవడానికి ప్రజలు భారీగా పోగయ్యారు. చాలా పొడవైన క్యూ ఏర్పడింది. హైదరాబాద్ లో కూడా వంద రూపాయలకు కిలో ఉల్లి దొరుకుతుంది… దీంతో  ప్రభుత్వమే… నగరంలోని పలు చోట్ల కౌంటర్లు పెట్టి కిలో 40రూపాయలకు ఉల్లిగడ్డలను అమ్ముతున్నారు.