నల్గొండలో కరోనా నిబంధలను ప్రజాప్రతినిధులే ఉల్లంఘిస్తున్నారు. కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో నల్గొండలో మధ్యాహ్నం ఒంటి గంట వరకే సడలింపులు అమలు చేస్తున్నారు. అయితే నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పుట్టినరోజు వేడుకలు.. కరోనా నిబంధనలు ఉల్లంఘించి నిర్వహించారు. సడలింపు సమయం అయిపోయిన తర్వాత రాత్రి పూట చైర్మన్ బర్త్ డే సెలబ్రేషన్స్ చేశారు. మాస్కులు లేకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా కేక్ కట్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సామాన్యులకు రూల్స్ చెప్పే నేతలు.. కరోనా రూల్స్ పట్టించుకోరా అని పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు.
