V6 News

తెలంగాణపై కామెంట్స్ వివాదం.. ఏమాత్రం తగ్గని తేజస్వీ సూర్య.. క్షమాపణలు చెప్పిన కేంద్రమంత్రి

తెలంగాణపై కామెంట్స్ వివాదం.. ఏమాత్రం తగ్గని తేజస్వీ సూర్య.. క్షమాపణలు చెప్పిన కేంద్రమంత్రి

తెలంగాణ విభజనపై లోక్ సభలో చేసిన కామెంట్లపై ఏమాత్రం తగ్గడం లేదు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య. తెలంగాణ విభజనపై తాను సరిగ్గానే చెప్పాను.. విపక్ష కాంగ్రెస్ నేతలే తప్పుగా అర్థం చేసుకున్నారని సమర్థించుకున్నారు. తన మాటలను వక్రీకరించారని ఆరోపించారు.  మరోవైపు తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి శోభా కరందాజ్లే స్పందించారు. తేజస్వీ వ్యాఖ్యలు సరియైనవి కావని చెప్పారు.  తేజస్వీ వ్యాఖ్యలకు తాము బాధపడుతున్నట్లు చెప్పారు.. తేజస్వీ సూర్య తరపును తాను క్షమాపణ చెబుతున్నానని తెలిపారు శోభా కరందాజ్లే. 

పార్లమెంట్ స్పెషల్ సెషన్ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య లోక్ సభలో అసందర్భంగా తెలంగాణ విభజనపై వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనను భారత్ పాక్ విభజనతో పోల్చారు. తేజస్వీ కామెంట్స్ పై కాంగ్రెస్ , బీఆర్ ఎస్ ఎంపీలు, ఉద్యమకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీ తేజస్వీ సూర్య సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు  తేజస్వీ సూర్య బహిరంగ క్షమాపణలు చెప్పాలని   కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు.