"బాలకృష్ణ"కు వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్

"బాలకృష్ణ"కు వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్

నందమూరి వారసుడిగా తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ట్రెండ్ కు తగ్గ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నందమూరి నటసింహం బాలక-ృష్ణ జన్మదినం నేడు. కామెడీ అయినా, యాక్షన్ అయినా ఎలాంటి పాత్రైనా అలవోకగా లీనమై ఆకట్టుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. భారీ డైలాగులు చెప్పాలన్నా... కత్తి పట్టి విశ్వరూపం చూపాలన్నా.. అది బాలయ్యకే చెల్లుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఓ పక్క సినిమాలు, మరో పక్క రాజకీయాల్లోనూ దూసుకుపోతూ... తన హవా కొనసాగిస్తున్నారు. తన సహృదయంతో కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తోన్న నందమూరి బాలకృష్ణను పురస్కరించుకొని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చెప్తున్నారు.